హైదరాబాద్, జూన్17 (నమస్తే తెలంగాణ) : ప్రాజెక్టుల్లో పూడికతీత పనులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే పలు ప్రాజెక్టుల్లో చేపట్టిన పూడికతీత పనులపై బుధవారం సచివాలయంలో సంబంధిత అధికారులతో సమీక్షించారు. కడెం, లోయర్, మిడ్‌మానేరు డ్యామ్‌లలో చేపట్టిన పూడికతీత పనుల పురోగతిని నీటిపారుదల శాఖ ప్రధాన కార్యదర్శి శ్రీధర్, గనులశాఖ ప్రధాన కార్యదర్శి శ్రీధర్, నీటిపారుదలశాఖ సహాయ కార్యదర్శి కే శ్రీనివాస్, ఈఎన్సీ రమేశ్‌బాబులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ.. ప్రాజెక్టుల్లో నీటి నిల్వ సామర్థ్యాలను పెంపొందించే కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు తెలిపారు.