‘తెలంగాణ ఏర్పడితే ఈ ప్రాంతమంతా అంధకారం అవుతుంది. కరెంట్ తీగలు బట్టలారేసుకోవడానికి తప్ప ఎందుకూ పనికి రావు’.. సమైక్య రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇవి. అంటే అప్పటికి తెలంగాణ పరిస్థితి ఎంత దుర్భరంగా ఉన్నదో అర్థం చేసుకోవచ్చు. కానీ, ఆ వెక్కిరింతలనే అభివృద్ధి మెట్లుగా చేసుకొని పదేండ్లలో తెలంగాణ విద్యుత్తు వెలుగుల మాగాణంగా మారింది. కేసీఆర్ నాయకత్వంలో విద్యుత్తు కోతల్లేని రాష్ట్రంగా వెలిగింది.
Telangana | హైదరాబాద్, మే 20 (నమస్తే తెలంగాణ): ఒకప్పుడు యంత్రాలు నడవాలంటే కరెంటు కోసం పక్కచూపులు చూసే స్థితి నుంచి కోతల్లేని స్థితికి తెలంగాణ విద్యుత్తు రంగం పురోగమించింది. అంతులేని కరెంట్ కోతలు దూరమయ్యాయి. పవర్ హాలిడేలు మాయమయ్యా యి. విద్యుత్తు కటకట స్థితి నుంచి స్వయం సమృద్ధిని సాధించి మిగులు విద్యుత్తు దిశలో ముందుకు సాగుతున్నది. మొత్తంగా తెలంగా ణ విద్యుత్తు ధగధగల్లో వెలిగి, ప్రపంచ పటం లో ప్రకాశించింది. దేశ విద్యుత్తు రంగానికి పాఠమైంది. అనేక రాష్ర్టాలకు కేస్‌స్టడీ అయ్యిం ది. దశాబ్ది ఉత్సవాల ముగింపు వేళ ఈ పదేం డ్ల ప్రస్థానాన్ని మళ్లీ మననం చేసుకుందాం.
కొత్తవి ప్రారంభించి.. కోతలను అధిగమించి..
గత ప్రభుత్వాలు పెట్టుబడిదారులకు కొమ్ముకాస్తూ ప్రైవేట్ రంగంలో విద్యుత్తు ఉత్పాదనను ప్రోత్సహించాయి. కానీ, కేసీఆర్ సర్కారు ప్రభుత్వ రంగంలో తెలంగాణ జెన్కో ఆధ్వర్యంలోని ప్లాంట్లను పెద్దఎత్తున వినియోగంలోకి తెచ్చింది. పదేండ్లలో పలు ప్లాంట్లను మెరుపువేగంతో పూర్తిచేసింది. కాకతీయ థర్మల్ పవర్ ప్లాంట్ (కేటీపీపీ)లో 600 మెగావాట్లు, దిగువ జూరాలలో 240 మెగావాట్లు, పులిచింతలలో 120 మెగావాట్లు, కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ (స్టేజ్-7)లో 800 మెగావాట్లు, భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్లో 1,080 మెగావాట్ల సామర్థ్యం గల ప్లాంట్లను వినియోగంలోకి తెచ్చింది. కేవలం 48 నెలల రికార్డు సమయంలోనే కేటీపీస్లో 800 మెగావాట్ల సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ ప్లాంట్‌ను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఇదో రికార్డు.
అన్ని రంగాలకు నిరంతర విద్యుత్తు
రాష్ట్రం ఏర్పడిన కొద్దికాలంలోనే విద్యుత్తు కోతలను తెలంగాణ అధిగమించింది. అన్ని రంగాలకు నిరంతర నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేస్తున్న రాష్ట్రంగా ఆవిర్భవించింది. కేసీఆర్ దార్శనికతలో ఉద్యమ ఆకాంక్షలకు అనుగుణంగా వ్యవసాయ, పారిశ్రామిక, సేవ, వ్యాపార రంగాలకు తోడ్పాటు అందింది. 2014లో 7,778 మెగావాట్లుగా ఉన్న విద్యుత్తు ఉత్పాదక సామర్థ్యాన్ని, 2023 నాటికి 18,567 మెగావాట్లకు పెంచింది. విద్యుత్తు సరఫరా వ్యవస్థలను సైతం బలోపేతం చేసింది. ఉత్పత్తి సరఫరా వ్యవస్థలను బలోపేతం చేసేందుకు తొమ్మిదేండ్లల్లో రూ.97,321 కోట్లు వెచ్చించింది.
విద్యుత్తు రంగంలో కేసీఆర్ సర్కారు ఘనతలు
విద్యుత్తు రాయితీలుగా..
ఐదు నెలల్లోనే మళ్లీ కరెంట్ కోతలు
బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో పదేండ్లపాటు రాష్ట్రంలో కోతలు లేకుండా నిరంతరాయంగా విద్యుత్తు సరఫరా జరుగగా, కాంగ్రెస్ సర్కారు ఏర్పడిన ఐదు నెలల్లో మళ్లీ కరెంట్ కోతలు మొదలయ్యాయి. ఎన్నికల ప్రచారంలో కాం గ్రెస్ నాయకుల సభల్లోనే కరెంట్ కోతలు జరిగిన విషయం మీడియాలో వచ్చింది. ఇప్పటికీ ఎక్కడో ఒక చోట రాష్ట్రంలో కరెంట్ పోవ డం నిత్యకృత్యంగా మారింది. ఇటీవల వానల కు విద్యుత్తు వ్యవస్థ దెబ్బతిని కొన్ని గ్రామాలు అంధకారంలో మగ్గిపోయాయి. కొన్ని మండలాలకు రోజంతా కరెంట్ సరఫరాను అధికారులు పునరుద్ధరించలేకపోయారు.
తలసరిలో నంబర్ 1
తలసరి విద్యుత్తు వినియోగం ప్రగతికి ఒక ప్రధాన సూచిక. 2014-15లో తెలంగాణలో తలసరి విద్యుత్తు వినియోగం 1,356 యూనిట్లు మాత్రమే. 2021-22 నాటికి ఇది 2,126 యూనిట్లకు పెరిగింది. ఇది జాతీయ తలసరి వినియోగం కన్నా 69.40 శాతం ఎకువ. మిగులు విద్యుత్తులో రాష్ట్రం కీలక అడుగులేసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్టు భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్లో ఒకోటి 270 మెగావాట్ల సామర్థ్యం గల 4 యూనిట్లను ప్రారంభించింది. నల్లగొండ జిల్లా దామరచర్లలో టీఎస్జెన్కో నిర్మిస్తున్న 4 వేల మెగావాట్ల యాదాద్రి అల్ట్రా మెగా థర్మల్ పవర్ ప్లాంట్ రెండు దశల్లో ఇటీవలే ముందుడుగు పడింది. రెండు యూనిట్లల్లోని బాయిలర్లల్లో విజయవంతంగా బొగ్గును మండించారు. మరో మూడు యూనిట్లు త్వరలోనే వినియోగంలోకి రానున్నాయి.
విద్యుత్తు వెలుగుల ప్రస్థానం (మెగావాట్లలో)