హైదరాబాద్, ఆగస్టు 25 (నమస్తే తెలంగాణ): భారత దేశ సెంట్రల్ లేజిస్లేటివ్ అసెంబ్లీకి స్పీకర్‌గా ఎన్నికైన తొలి భారతీయుడు దివంగత విఠల్‌భాయ్ పటేల్ ఘనమైన వారసత్వాన్ని, విలువలను నేటితరం శాసన సభాపతులు కొనసాగించాలని తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పిలుపునిచ్చారు. విఠల్‌భాయ్ పటేల్ సంస్మరణ సందర్భంగా ఢిల్లీ అసెంబ్లీలో రెండ్రోజులపాటు జరుగుతున్న ఆలిండియా స్పీకర్స్ కాన్ఫరెన్స్‌లో గడ్డం ప్రసాద్ కుమార్ సోమవారం ప్రసంగించారు.