కామారెడ్డి : కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలోని నస్రుల్లాబాద్ మండలం నెమలి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులతో కలిసి శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి పాఠశాల ప్రార్థన కార్యక్రమంలో పాల్గొన్నారు. విద్యార్థులతో పాటు స్పీకర్ పోచారం కూడా వరుస క్రమంలో నిలబడి ప్రార్థన చేయడం అందరి దృష్టిని ఆకర్షించింది. ప్రార్థన ముగిసిన అనంతరం 60 లక్షలతో నిర్మించిన తొమ్మిది అదనపు తరగతి గదులను పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు.