Speaker Pocharam | అరచేతితో సూర్యకిరణాలను.. కామారెడ్డిలో కేసీఆర్ విజయాన్ని ఎవరూ ఆపలేరు : స్పీకర్ పోచారం
Speaker Pocharam | అరచేతితో సూర్యకిరణాలు ఆపలేము.. కామారెడ్డిలో కేసీఆర్(CM KCR) విజయాన్ని ఎవరూ ఆపలేరని శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి(Speaker Pocharam) అన్నారు. కామారెడ్డి నియోజకవర్గంలో ప్రతిపక్షాల డిపాజిట్లు గల్లంతు కావడం ఖాయమని స్పష్టం చేశారు. కామారెడ్డి(Kamareddy) జిల్లా కేంద్రంలో గురువారం నిర్వహించిన బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో స్పీకర్ మాట్లాడారు.
కామారెడ్డి, అక్టోబర్ 26 : అరచేతితో సూర్యకిరణాలు ఆపలేము.. కామారెడ్డిలో కేసీఆర్(CM KCR) విజయాన్ని ఎవరూ ఆపలేరని శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి(Speaker Pocharam) అన్నారు. కామారెడ్డి నియోజకవర్గంలో ప్రతిపక్షాల డిపాజిట్లు గల్లంతు కావడం ఖాయమని స్పష్టం చేశారు. కామారెడ్డి(Kamareddy) జిల్లా కేంద్రంలో గురువారం నిర్వహించిన బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో స్పీకర్ మాట్లాడారు. అంతకు ముందు నియోజకవర్గంలోని వివిధ గ్రామాలకు చెందిన 400 మందికి పైగా కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరారు.
ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి వారికి గులాబీ కండువాలు కప్పి బీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. కామారెడ్డి నుంచి సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్నందున ఇక్కడి ప్రాంతం బాగా అభివృద్ధి చెందుతుందని, ఈ ప్రాంత ప్రజలకు అదృష్టం రాబోతుందని స్పీకర్ తెలిపారు. కేసీఆర్‌ను లక్ష ఓట్లకు పైగా మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీలో అందరూ ముఖ్యమంత్రి అభ్యర్థులేనని ఎద్దేవా చేశారు. కర్ణాటక రాష్ట్రంలో అమలు సాధ్యం కానీ హామీలను ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని, ఆ రాష్ట్రంలో పాలన గాడి తప్పిందన్నారు.
దేశంలో 24 రాష్ర్టాల్లో అధికారంలో ఉన్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు.. మన రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఆయా రాష్ర్టాల్లో అమలు చేసి, అప్పుడు మాట్లాడాలని హితవు పలికారు. తెలంగాణలో కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిని పక్క రాష్ర్టాలు గుర్తిస్తున్నాయని, అనేక రాష్ట్రాలకు చెందిన వారు ప్రభుత్వ పథకాలను ప్రశంసిస్తున్నారన్నారు.
దక్షిణ భారతదేశంలో పుష్కలంగా పంటలు పండించే తెలంగాణ రైతులకు రైతుబంధు ఇవ్వొద్దని కాంగ్రెస్ నాయకులు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడం రైతు వ్యతిరేక చర్య అని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ ముజీబుద్దీన్, ఫుడ్ కమిషన్ మాజీ చైర్మన్ తిరుమల్‌రెడ్డి పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

