Srisailam | శ్రీశైలం, జులై 27 : శ్రీశైల మహా క్షేత్రం భక్తులతో సందడిగా మారింది. వారాంతపు సెలవులతోపాటు ప్రాజెక్టు గేట్లు తెరిచి ఉండటంతో పర్యాటకుల తాకిడి పెరుగుతొంది. ఆదివారం వివిధ ప్రాంతాల నుండి వచ్చిన యాత్రికులతో క్షేత్ర పురవీధులు కళకళలాడాయి. ఉభయ దేవాలయాలలో స్వామిఅమ్మవార్ల దర్శనం కల్పించడంతోపాటు ఆయా ఆర్జిత సేవలు యధాతథంగా జరుగుతున్నాయని అధికారులు తెలిపారు.
శ్రావణ మాసంతోపాటు పర్యాటకులు కూడా అధిక సంఖ్యలో వస్తుండటంతో అందరికీ స్పర్శదర్శనాలు కల్పించేలా అన్ని రోజులు స్పర్శదర్శనాలు అందుబాటులో ఉంచుతున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. srisailadevasthanam.org ఆన్లైన్లో రోజుకు మూడు స్లాట్స్లలో ఉండే టిక్కెట్లను ముందస్తుగా నమోదు చేసుకుని తగిన రశీదులతోపాటు ఆధార్ తప్పనిసరిగా తీసుకుని దర్శనాలకు రావాలని అధికారులు పేర్కొన్నారు.