హైదరాబాద్, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ): అంతరిక్ష సాంకేతికతలో అగ్రగామిగా నిలిచేందుకు తెలంగాణ వేగంగా పరుగులు పెడుతున్నది. రాష్ట్రంలో ఇప్పటికే స్పేస్ టెక్నాలజీకి సంబంధించిన సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమ (ఎంఎస్ఎంఈ) కేంద్రీకృతమై ఉన్నది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ చేపట్టిన మార్స్ మిషన్ వంటి ప్రతిష్ఠాత్మక ప్రయోగాల్లో తెలంగాణ కంపెనీలే కీలకంగా వ్యవహరించాయి. ఇప్పుడు భవిష్యత్ టెక్నాలజీలను కూడా అందిపుచ్చుకొనేందుకు అడుగులు వేస్తున్నది. అందులో భాగంగా ఇటీవల స్పేస్‌టెక్ ఫ్రేమ్‌వర్క్‌ను ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు ఆవిష్కరించారు.
ఇప్పటికే వెయ్యి కంపెనీలు
ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిన ఇస్రో మార్స్ ఆర్బిటర్ మిషన్ (ఎంవోఎం)కు 30 శా తం విడిభాగాలు తెలంగాణకు చెందిన సంస్థల నుంచే సరఫరా అయ్యాయి. వ్యవసాయం తదితర రంగాలకు దిగువశ్రేణి అంతరిక్ష సేవలకు సంబంధించి టెస్ట్ సొల్యూషన్స్‌లో తెలంగాణకు సంస్థలు కీలకపాత్ర పోషిస్తున్నాయి. దీంతో స్పేస్ మార్కెట్ వ్యాల్యూ చెయిన్‌లో రాష్ర్టాన్ని ప్రధాన కేంద్రంగా తీర్చిదిద్దాలని భావిస్తున్న ప్రభుత్వం, దీనికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి పెట్టింది. రాష్ట్రంలో ఇప్పటికే ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాలకు అవసరమైన విడిభాగాలు తయారు చేసేందుకు వెయ్యి ఎంఎస్‌ఎంఈలున్నాయి.
గ్లోబల్ లింకర్ బృందం వీటికి తగిన పర్యావరణ వ్యవస్థ రూపకల్పనలో మద్దతుగా నిలిచింది. వీటికి అవసరమైన భాగస్వాములను జోడించేందుకు ప్రభుత్వం కృషిచేస్తున్నది. స్పేస్ టెక్నాలజీకి అవసమైన నిపుణులను తయారు చేసేందుకు ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ (ఐఐఎస్టీ), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ (ఐఐఆర్ఎస్), ఇస్రో సహకారంతో తెలంగాణ యూనివర్సిటీల్లో కోర్సులను ప్రవేశపెడతామని స్పేస్‌టెక్ ఫ్రేమ్‌వర్క్‌లో వెల్లడించింది. నీతి ఆయోగ్ అటల్ ఇన్నోవేషన్ మిషన్‌లో భాగంగా రాష్ట్రంలోని రెండు జిల్లాల్లో 10 స్పేస్ ఎక్స్‌ప్లోరేషన్ ల్యాబ్‌లను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపింది.
లో-ఎర్త్ ఆర్బిట్లకు ప్రాధాన్యం
అంతరిక్ష మార్కెట్ వాల్యూ చెయిన్‌లో శాటిలైట్ల తయారీ, లాంచర్ తయారీ ముఖ్యమైనవి. సిస్టం అనుసంధానం-డిజైన్, అసెంబ్లింగ్, సబ్-సిస్టమ్స్, ఎక్విప్మెంట్, కాంపోనెంట్స్ తదితర అంశాలు ఇం దులో ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వం చిన్న శాటిలైట్ల తయారీ యూనిట్లు, అసెంబ్లింగ్, ఇంటిగ్రేషన్, టెస్టిం గ్ (ఏఐటీ) సేవలపై దృష్టి కేంద్రీకరించింది. రైతులకు అవసరమైన సేవలను దృష్టిలో పెట్టుకొని తక్కువ రి స్క్తో కూడిన చిన్నతరహా లో-ఎర్త్ ఆర్బిట్ (ఎల్ఏ వో) శాటిలైట్లకు ప్రాధాన్యమివ్వాలని నిర్ణయించింది. గ్లోబల్ స్పేస్ ఇండస్ట్రీ వార్షిక వృద్ధి రేటు (సీఏజీఆర్) 5.6 శాతంగా ఉన్నది. 2026 నాటికి అది 558 బిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనా. అంతరిక్ష టెక్నాలజీ రంగంలో తెలంగాణను కీలక కేంద్రంగా మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది.
స్పేస్‌టెక్ ఫ్రేమ్‌వర్క్ లక్ష్యాలు