హైదరాబాద్, జూన్ 10 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు బలహీనపడుతున్నాయని, ప్రస్తుతం దక్షిణ తెలంగాణ, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో రుతుపవనాలు నిలిచిపోయే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. మరో 10 రోజులవరకు ఉష్ణోగ్రతలు పెరుగవచ్చని అధికారులు తెలిపారు.
జూన్ 17 వరకు చెదురుమదురు వర్షాలు పడే అవకాశమున్నట్టు చెప్పారు. జూన్ 19 నుంచి 23 మధ్య తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో రుతుపవనాలు చురుగ్గా కదులుతాయని,అప్పుడు మళ్లీ వర్షాలు కురుస్తాయని అధికారులు వెల్లడించారు. జూన్ 1న వానకాలం ప్రారంభమైనప్పటి నుంచి రాష్ట్రంలో భారీ వర్షపాతం నమోదు కాలేదు. 10 రోజుల్లో -24 శాతం లోటు వర్షపాతం నమోదైనట్టు అధికారులు వెల్లడించారు.