హైదరాబాద్, డిసెంబర్ 7 (నమస్తే తెలంగాణ) : దక్షిణ భారతదేశ సైన్స్‌ఫెయిర్ (సౌతిండియా సైన్స్ ఫెయిర్‌కు) ఈ సారి తెలంగాణ అతిథ్యం ఇవ్వనున్నది. 2026 జనవరి 19 నుంచి 23 వరకు ఐదు రోజులపాటు ఈ సైన్స్ ఫెయిర్ మన రాష్ట్రంలో జరుగనున్నది.
సంగారెడ్డి జిల్లా రామచంద్రాపూర్, కొల్లూరులోని ది గాడియం స్కూల్లో ఈ సైన్స్ ఫెయిర్ నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది. తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ర్టాలకు చెందిన విద్యార్థుల ఎగ్జిబిట్లను ఈ సైన్స్ ఫెయిర్‌లో ప్రదర్శిస్తారు.