SCR | దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. చర్లపల్లి-నర్సాపూర్-చర్లపల్లి, జాల్నా -తిరుపతి-జాల్నా మధ్య ప్రస్తుతం నడుస్తున్న రైళ్లను వచ్చ ఏడాది మార్చి నెలాఖరు వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నది. చర్లపల్లి-నర్సాపూర్ (07233) రైలు ప్రతి శనివారం సాయంత్రం 7.50 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7 గంటలకు గమ్యస్థానం చేరుకుంటుందని పేర్కొంది. నర్సాపూర్-చర్లపల్లి (07234) రైలు ప్రతి ఆదివారం రాత్రి 8 గంటలకు బయలుదేరి ఉదయం 7 గంటలకు గమ్యస్థానం చేరుకుంటుందని పేర్కొంది. జాల్నా-తిరుపతి (07609) రైలు ప్రతి సోమవారం ఉదయం అందుబాటులో ఉంటుందని.. జాల్నా స్టేషన్లో ఉదయం 7 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 10.45 గంటలకు తిరుపతికి చేరుతుందని చెప్పింది.
తిరుపతి-జాల్నా రైలు మంగళవారం మధ్యాహ్నం 3.15 గంటలకు బయలుదేరి.. మధ్యాహ్నం 3.50 గంటలకు గమ్యస్థానం చేరుతుందని వివరించింది. చర్లపల్లి-నర్సాపూర్-చర్లపల్లి రైలు నల్గొండ, మిర్యాలగూడ, నడికుడ, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, గుడివాడ, కైకలూరు, ఆకివీడు, భీమవరం టౌన్, విరసవరం, పాలకొల్లు స్టేషన్లలో ఆగుతుందని పేర్కొంది. జాల్నా-తిరుపతి-జాల్నా రైలు పార్తూర్, సేలు, మన్వత్రోడ్, పర్బణి, గాంఖేర్, పర్లి వైద్యనాథ్, లాథూర్ రోడ్, ఉద్గిర్, బీదర్, మార్పల్లి, వికారాబాద్, లింగంపల్లి, చర్లపల్లి, నల్గొండ, మిర్యాలగూడ, నడికుడ, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, బాపట్ల, చిరాల, ఒంగోలు, కావలి, నెల్లూరు, గుడూరు, రేణిగుంట స్టేషన్లలో ఆగుతుందని వివరించింది. ఆయా రైళ్లలో సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ, స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్లు అందుబాటులో ఉన్నాయని వివరించింది.