SCR | చర్లపల్లి నుంచి ఉత్తరప్రదేశ్‌లోని సుబేదార్‌గంజ్, యశ్వంత్‌పూర్ నుంచి రిషికేశ్కు ప్రత్యేక రైళ్లకు ప్రత్యేక రైళ్లను దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ప్రస్తుతం ఉన్న ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక రైళ్లను తీసుకువచ్చినట్లు పేర్కొంది. ఈ రైళ్లు గురువారం ఆగస్టు 2వ తేదీ వరకు రాకపోకలు సాగిస్తాయని చెప్పింది. సుబేదార్‌గంజ్-చర్లపల్లి (04121) రైలు జులై 31 వరకు రాకపోకలు సాగిస్తుందని.. ప్రతి గురువారం మధ్యాహ్నం 3.50గంటలకు బయలుదేరి మరుసటి రోజు రాత్రి 8 గంటలకు గమ్యస్థానం చేరుకుంటుందని చెప్పింది.
చర్లపల్లి-సుబేదార్‌గంజ్ (04122) రైలు ఈ నెల 28 నుంచి ఆగస్టు 2 వరకు అందుబాటులో ఉంటుందని.. ప్రతి శనివారం ఉదయం 4.30 గంటలకు బయలుదేరి.. మరుసటి రోజు ఉదయం 10 గంటలకు గమ్యస్థానం చేరుకుంటుందని పేర్కొంది. ఈ రైలు రెండువైపులా ఫతేపూర్, గోవింద్‌పురి, పోఖ్రాయాన్, ఒరాయ్, విరంగన లక్ష్మీబాయి, బీనా, రాణి కమలాపతి, ఇటార్సీ, జుజార్‌పూర్, నాగ్‌పూర్, బల్హర్షా, సిర్పూర్ కాగజ్‌నగర్, మంచిర్యాల, పెద్దపల్లి, కాజీపేట్ స్టేషన్లలో ఆగుతాయని వివరించింది. ఈ రైలులో థర్డ్ ఏసీ, స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు అందుబాటులో ఉంటాయని పేర్కొంది. యశ్వంత్‌పూర్-యోగ్ నగరి రిషికేష్ (06597) ఈ నెల 26 నుంచి జులై 3 వరకు ప్రతి గురువారం నడుస్తుందని.. కాచిగూడలో రాత్రి 8.50గంటలకు అందుబాటులో ఉంటుందని పేర్కొంది.
రిషికేష్-యశ్వంత్‌పూర్ (06598) మధ్య ఈ నెల 28 నుంచి జులై 5 వరకు నడుస్తుందని.. ప్రతి శనివారం సాయంత్రం 5.55గంటలకు బయలుదేరి.. సోమవారం 7.45గంటలకు గమ్యస్థానం చేరుతుందని వివరించింది. ఈ రైలు యెహలంక, హిందూపురం, ధర్మవరం, అనంతపురం, డోన్, కర్నూల్ సిటీ, కాచిగూడ, కాజీపేట, బల్హర్షా, నాగ్‌పూర్, భోపాల్, బీనా జంక్షన్, వీజీఎల్ ఝాన్సీ, గ్వాలియర్, ఆగ్రా కాంట్, మథుర, నిజాముద్దీన్, మథుర, తాజ్ప్రిన్, తాజీ నగర్, ఘాజీ, రూర్కీ, హరిద్వార్ స్టేషన్లలో రైలు ఆగుతుందని తెలిపింది. ఈ ప్రత్యేక రైళ్లలో ఏసీ ఫస్ట్ క్లాస్, సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ, స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు అందుబాటులో ఉంటాయని దక్షిణ మధ్య రైల్వే వివరించింది.