ప్రముఖ నటుడు సోనూసూద్ మరోసారి మానవత్వాన్ని చాటుకున్నాడు. ప్రాణాప్రాయ స్థితిలో ఉన్న ఓ యువకుడి ప్రాణాలను బతికించేందుకు ప్రార్థిద్దామని తన అభిమానులకు సోనూసూద్ పిలుపునిచ్చారు. ఢిల్లీకి చెందిన హితేశ్ శర్మ అనే యువకుడు ఈ ఏడాది ఏప్రిల్ నుంచి కరోనాతో పోరాడుతున్నాడు. ఈ క్రమంలోనే అతని ఊపిరితిత్తులు కూడా దెబ్బతిన్నాయి. ఈ విషయం తెలుసుకున్న సోనూసూద్.. అతన్ని ప్రాణాలతో కాపాడేందుకు ఎయిర్ అంబులెన్స్ ద్వారా నిన్న ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. నగరంలోని యశోద ఆస్పత్రిలో శర్మకు ఊపిరితిత్తుల ట్రాన్స్‌ప్లాంట్ సర్జరీ ఇవాళ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో సోనూసూద్ ట్వీట్ చేశారు.
నిన్న ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు ఎయిర్ అంబులెన్స్‌లో తీసుకొచ్చిన హితేశ్ శర్మకు యశోద ఆస్పత్రిలో లంగ్స్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జరీ కొనసాగుతోంది. ఏప్రిల్ నుంచి కరోనాతో పోరాడుతున్న అతను నిజమైన హీరో.. ఆ యువకుడు ప్రాణాలతో బయటపడాలని మనందరం ప్రార్థించాల్సిన అవసరం ఉందని అభిమానులను సోనూసూద్ పిలుపునిచ్చారు.
Yesterday we shifted Hitesh Sharma from Delhi to Hyderabad on an Air Ambulance. He will undergo a Lung Transplant surgery at @YashodaHospital. He’s been a true hero who’s been fighting COVID since April. We need your prayers to get him back hale and hearty. 🙏 @SoodFoundation🇮🇳 pic.twitter.com/VcXdsk4Gg3
— sonu sood (@SonuSood) July 15, 2021