న్యూఢిల్లీ: కాంగ్రెస్ మాజీ జాతీయ అధ్యక్షురాలు సోనియా గాంధీ శనివారం స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఆమెను సిమ్లాలోని ఇందిరా గాంధీ వైద్య కళాశాల దవాఖానలో చేర్పించారు. ఆమెకు ఎంఆర్ఐ పరీక్షలు చేశారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉంది. వైద్యులు ఆమెను పర్యవేక్షిస్తున్నారు. హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖు మీడియా ప్రధాన సలహాదారు నరేశ్ చౌహాన్ ఈ వివరాలను మీడియాకు తెలిపారు. ఆమె సిమ్లాలో ఉండగా అస్వస్థతకు గురైనట్లు తెలుస్తున్నది.