హైదరాబాద్, మే 12 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారుగా సోమేశ్‌కుమార్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. సచివాలయంలోని ఆరో అంతస్థులో సతీసమేతంగా పూజలు చేశారు. బాధ్యతలు స్వీకరించిన సోమేశ్‌కుమార్‌ను ట్రెసా రాష్ట్ర అధ్యక్షుడు వంగ రవీందర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి గౌతమ్‌కుమార్, బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణ కృష్ణమోహన్‌తో పాటు పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, ఉన్నతాధికారులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఆయన మూడేండ్ల పాటు పదవిలో కొనసాగనున్నారు.