హైదరాబాద్, నవంబర్ 15 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని మహిళా స్వయం సహాయక సంఘాలకు సోలార్ప్లాంట్లు ఏర్పాటుచేసే అవకాశమివ్వనున్నట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ప్లాంట్ల ఏ ర్పాటుకు స్థలసేకరణ, రుణాలందించడంలో వారికి చేయూతనందించాలని అధికారులను ఆదేశించారు. పీఎం కుసుమ్ పథకంలో భా గంగా 4 వేల మెగావాట్ల సోలార్ విద్యుత్తుప్లాంట్ల ఏర్పాటుకు ఇటీవలే ప్రభుత్వం అనుమతిచ్చింది. ఇందులో వెయ్యి మెగావాట్ల ప్లాంట్లను మహిళా సంఘాలకు అప్పగించాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి సీతక్క కోరారు. ఇందుకు అవసరమయ్యే స్థలాన్ని లీజుకు ఇప్పిస్తామని తెలిపారు. ఆ శాఖ అధికారులు ఇంధనశాఖకు ప్రతిపాదనలు సమర్పించారు. దీంతో డిప్యూ టీ సీఎం భట్టి విక్రమార్క విద్యుత్తుశాఖ అధికారులు, బ్యాంకర్లతో సమీక్షించి రుణాలు ఇ ప్పించాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో ఇంధనశాఖ సెక్రటరీ సందీప్ సుల్తానియా, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ కార్యదర్శి లోకేశ్, సెర్ప్ సీఈవో దివ్యాదేవరాజన్, ట్రాన్స్కో సీఎండీ కృష్ణభాస్కర్, రెడ్ వీసీ ఎండీ అనీల పాల్గొన్నారు.