హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 20 (నమస్తే తెలంగాణ): సోలార్ విద్యుత్తు ఉత్పత్తి కోసం కేంద్ర ప్రభు త్వం ప్రకటించిన సబ్సిడీ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలంగాణ సోలార్ ఎనర్జీ అసోసియేషన్ అ ధ్యక్షుడు బుర్ర అశోక్‌కుమార్ మంగళవారం కోరారు. నెలకు 300 యూని ట్ల విద్యుత్తు శక్తిని గృహ అవసరాలకు వినియోగించే లబ్ధిదారులకు సబ్సిడీని పెంచుతూ కొత్త పథకాన్ని కేంద్ర ప్రభు త్వం ప్రకటించిందని, దీన్ని తాము అభినందిస్తున్నామని పేర్కొన్నారు. ఐదు కిలోవాట్ల సామర్థ్యం కలిగిన రూఫ్ టాప్ సోలార్ వ్యవస్థలకు మరింత సబ్సిడీ పెంచడం వల్ల చాలామందికి మేలని తెలిపారు.