హైదరాబాద్: సింగిల్ యూజ్ ప్లాస్టిక్ సమస్యకు పరిష్కారం దిశగా తొలి అడుగుపడింది. కూకట్‌పల్లిలోని ఐడీపీఎల్ ఏరియాలో ఇవాళ ఉదయం జీహెచ్ఎంసీ (GHMC) అధికారులు ఎనీ టైమ్ బ్యాగ్ (ATB) మిషన్‌ను ఏర్పాటు చేశారు. ఐడీపీఎల్‌లోని పండ్ల మార్కెట్లో ఏర్పాటు చేసిన ఈ మెషిన్లో ఒక పది రూపాయల నోటు లేదా కాయిన్‌ను జారవిడవగానే వస్త్రంతో తయారు చేసిన ఒక క్యారీ బ్యాగ్ బయటికి వస్తుంది. సుమారు 5 కేజీల వరకు బరువును భరించగల సామర్థ్యం ఉండేలా ఈ క్యారీ బ్యాగులను డిజైన్ చేశారు.
సోలార్ విద్యుత్‌ను వినియోగించుకుని పనిచేసేలా ఈ వెండింగ్ మిషన్‌ను రూపొందించారు. మొవేట్ (MOVATE), యునైటెడ్ వే ఆఫ్ హైదరాబాద్ సంస్థలు ఈ ఎనీ టైమ్ బ్యాగ్ మిషన్ ప్రాజెక్టును ఆవిష్కరించాయి. ఈ బ్యాగులు విశాలంగా, దృఢంగా ఉంటాయి. మార్కెట్ల నుంచి కిరాణా సరుకులు, పండ్లు, కూరగాయలు కొనుగోలు చేసి తీసుకెళ్లేందుకు ఈ క్యారీ బ్యాగులు అనువుగా ఉంటాయి. ఈ ATB మిషన్లను త్వరలో రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు విస్తరించనున్నారు.
కాగా, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ సమస్య పరిష్కారానికే కాకుండా స్వయం సహాయక సంఘాల మహిళలకు ఉపాధి కల్పించడానికి కూడా ఈ ఎనీ టైమ్ బ్యాగ్ మిషన్ ప్రాజెక్టు తోడ్పడనుంది. అయితే, ఐడీపీఎల్‌లో ఎనీ టైమ్ బ్యాగ్ మిషన్ ఏర్పాటు చేసిన విషయాన్ని కూకట్పల్లి జోనల్ కమిషనర్ మమత ట్విటర్ ద్వారా వెల్లడించారు. ఈ మేరకు ట్విటర్లో ఆమె ATB మిషన్ ఫొటోలను షేర్ చేశారు. దాంతో నెటిజన్లు ఈ నూతన ఆవిష్కరణను స్వాగతిస్తున్నారు.
Solar powered “Cloth bag ATM ” installed near IDPL fruit market . A #CSR initiative of #Unitedwayofhyderabad. Alternative to #SUP tied up with self help group women. #ReduceReuseRecycle #SWM #ghmc #WomenEmpowerment@KTRBRS @arvindkumar_ias @GadwalvijayaTRS @CommissionrGHMC pic.twitter.com/FpJuT6p5pm
— zc_kukatpally (@zckukatpally) April 8, 2023
This is a terrific initiative 👍 https://t.co/4gm9cnvZeT
— KTR (@KTRBRS) April 8, 2023