ఆడపిల్ల పుడితే చెత్తకుప్పల్లో, ముళ్లకంపల్లో పారేస్తున్న ఘటనలు ఎన్నో. కానీ, ఆడబిడ్డ పుట్టడమే అదృష్టమంటూ సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం ఖానాపూర్‌లో ఓ తండ్రి ఊరంతా కూరగాయలు పంచి సంతోషాన్ని పంచుకున్నారు. గ్రామానికి చెందిన మరబోయిన నవీన్‌కు బుధవారం ఆడపిల్ల పుట్టింది. మహాలక్ష్మి జన్మించిందంటూ నవీన్ ఆదివారం గ్రామంలోని 300 ఇండ్లకు నాలుగైదు రోజులకు సరిపడేలా కూరగాయలు పంపిణీ చేశారు. -నంగునూరు, మే 30