హైదరాబాద్, మే 22(నమస్తే తెలంగాణ): గ్రీన్కో సంస్థ నుంచి విద్యుత్తు కొనుగోలులో భారీ అక్రమాలు జరిగాయని సామాజిక కార్యకర్త బక్క జడ్సన్ ఆరోపించా రు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరపాలని కోరుతూ ఆయన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్‌ని ఆశ్రయించారు. ఫిర్యాదును స్వీ కరించిన ఈడీ ప్రాథమిక విచారణ జరుపుతున్నట్టు సమాచారం. ఏపీలోని పిన్నాపురంలో గ్రీన్కో సంస్థ ఇంటిగ్రేటెడ్ రెన్యూవబుల్ ఎనర్టీ పవర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసి, పంప్డ్ స్టోరేజీ ద్వారా విద్యుత్తు ఉత్పత్తి చేస్తున్నది. ఈ ప్లాంట్ నుంచి యూనిట్‌కు రూ.6.70-6.75 చొప్పున వెచ్చించి విద్యు త్తు కొనుగోలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్నదని జడ్సన్ తెలిపారు.
ఒక ప్రైవేట్ కంపెనీ విద్యుత్తు ఉత్పత్తి, వాణిజ్య అవసరాల కోసం శ్రీశైలం బ్యాక్‌వాటర్, గోరకల్లు జలాశయ వ్యవస్థలను వాడుతున్నట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. సుప్రీంకోర్టుతోపాటు ట్రిబ్యునల్ వద్ద జలవివాదాలు పెండింగ్‌లో ఉన్నప్పుడు ప్రా జెక్ట్‌కు ఎలా అనుమతి ఇస్తారని ప్రశ్నించారు.
విద్యుత్తు చట్టం-2003 ప్రకారం విద్యు త్తు కొనుగోళ్లల్లో కాంపిటేటివ్ బిడ్డింగ్‌ను పాటించలేదని, ఈఆర్సీ అనుమతుల్లేకుండా నే ముందుకెళ్లారని జడ్సన్ ఫిర్యాదు చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి పా త్రపై దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. గ్రీన్కోకు అనుకూలంగా ఉండేలా అధిక ధరలతో కొనుగోలుకు వీరు సహకరించారని తద్వారా ప్రజలపై అదనపు ఆర్థిక భారం మోపారని ఫిర్యాదులో పేర్కొన్నారు. వనరులను ప్రైవేట్ కోసం వినియోగించడంపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు.