Odela | ఓదెల, మార్చి 9 : ఓదెల మండలంలోని పలు గ్రామాల్లో ఆదివారం ఉదయం మంచు తుఫాను కురిసింది. ఉదయం 6.45 నుంచి దాదాపు 40 నిమిషాల పాటు మంచి తుఫాను కురిసింది. 50 మీటర్ల దూరంలో ఉన్న రోడ్డు, వస్తువులు కూడా కనిపించనంతగా మంచు ఆవహించి ఉంది.
వేసవికాలం ప్రవేశించి మధ్యాహ్నం ఎండలు దంచుతుండగా, ఉదయం రాత్రి చలి ప్రభావం ఉంది. ఆదివారం ఉదయం మంచు ప్రభావం తీవ్రంగా ఉండడంతో వామ్మో ఇదేమో మంచు అంటూ ప్రజలు వాపోయారు. మంచు తుఫాను కారణంగా రోడ్లపై వాహనదారులు అతి నెమ్మదిగా వెళ్లాల్సి వచ్చింది.
అలాగే ఉదయం పూట వాహనాలపై వెళ్లేవారు ముఖాలకు మాస్కులు ధరించి, వాహనాల హెడ్ లైట్లు వేసుకొని ప్రయాణం సాగించారు. మంచు తుఫాను కారణంగా రైల్వే డ్రైవర్లు సిగ్నల్స్ కనిపించక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రైళ్లని ఈ కారణంగా వేగం తగ్గించి నడిపించారు. దేశ రాజధాని ఢిల్లీలో మాదిరిగా ఓదెల మండలంలో మంచు కనిపించడం ప్రజలు బెంబేలెత్తిపోయారు.