సచివాలయంలో కమ్ముకున్న పొగలు
సచివాలయ ప్రాంగణంలోని మీడియా పాయింట్, పబ్లిక్ సెల్, ఎన్ఆర్ఐ సెల్ విభాగాలు ఉన్న ప్రాంతంలో ఒకసారిగా దట్టమైన పొగలు అలుముకున్నాయి.
- షార్ట్‌సర్క్యూట్ అయినట్టు గుర్తించిన సిబ్బంది
హైదరాబాద్, అక్టోబర్ 25 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర సచివాలయంలో ఆదివారం ఆకస్మికంగా పొగలు వ్యాపించడంతో తీవ్ర కలకలం రేగింది. సచివాలయ ప్రాంగణంలోని మీడియా పాయింట్, పబ్లిక్ సెల్, ఎన్ఆర్ఐ సెల్ విభాగాలు ఉన్న ప్రాంతంలో ఒకసారిగా దట్టమైన పొగలు అలుముకున్నాయి. ఈ ఆకస్మిక పరిణామాన్ని గమనించిన భద్రతా సిబ్బంది, పోలీసులు తక్షణమే స్పందించి.. ఎలాంటి ప్రమాదం జరుగకుండా వెంటనే ఆయా విభాగాల డోర్లు తెరిచి ప్రాంగణాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు.
సిబ్బంది తనిఖీల్లో విద్యుత్తు వైర్లు కాలిపోయినట్టు గుర్తించారు. దీంతో ఎలక్ట్రికల్ షార్ట్ సర్యూట్ కారణంగానే వైరింగ్ కాలిపోయి భారీగా పొగలు వెలువడి ఉంటాయని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. ముందస్తు జాగ్రత్త చర్యగా సంబంధిత బ్లాక్‌కు విద్యుత్తు సరఫరాను నిలిపివేశారు. వెంటనే సాంకేతిక నిపుణులకు సమాచారం అందించగా, వారు ఘటనా స్థలానికి చేరుకుని వైరింగ్ లోపాలు, నష్ట తీవ్రతను సరిదిద్దే పనులను ప్రారంభించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

