నూతనంగా అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీలైన కృత్రిమ మేధస్సు, క్లౌడ్ కంప్యూటింగ్‌లు వివిధ రంగాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఇలాంటి టెక్నాలజీతో కూడిన బృహత్ కార్యక్రమాల ఫలితంగానే వ్యవసాయ రంగానికి సంబంధించిన ప్రాజెక్టు స్మార్ట్ న్యూట్రియంట్ మేనేజ్మెంట్ ఆఫ్ సాయిల్‌కు గోల్డ్ ఐకాన్ అవార్డు లభించింది.
-కేటీఆర్
హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 7 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రాజెక్టుకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన డిజిటల్ ఇండియా అవార్డ్స్-2022లో తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ సహకారంతో ఏర్పాటైన వ్యవసాయ రంగ ప్రాజెక్ట్ స్మార్ట్ న్యూట్రియంట్ మేనేజ్మెంట్ ఆఫ్ సాయిల్‌కు ‘గోల్డ్ ఐకాన్’ పురస్కారం లభించింది. శనివారం ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా తెలంగాణ ఐటీ శాఖ ఎమర్జింగ్ టెక్నాలజీ వింగ్ డైరెక్టర్ రమాదేవి, ఐటీ శాఖ సీనియర్ కన్సల్టెంట్ సుధీర్ కుమార్ ఈ అవార్డు అందుకున్నారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు మాట్లాడుతూ…అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాలను వినియోగించడంలో తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని, అందులో భాగంగానే ఐటీ శాఖ పరిధిలోని ఎమర్జింగ్ టెక్నాలజీ వింగ్‌ను ఏర్పాటు చేసి ప్రభుత్వ-ప్రైవేట్ సంస్థలకు ఉపయోగపడే కార్యక్రమాలను చేపడుతున్నామని చెప్పారు.
నూతనంగా అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీలైన కృత్రిమ మేధస్సు, క్లౌడ్ కంప్యూటింగ్‌లు వివిధ రంగాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాయన్నారు. వీటిని సమర్థవంతంగా వినియోగించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నిపుణులను నియమించి ఆయా టెక్నాలజీలను వివిధ రంగాల్లో వినియోగించేందుకు ప్రో త్సహిస్తున్నామన్నారు. ఇలా బృహత్ కార్యక్రమాల ఫలితంగానే వ్యవసాయ రంగానికి సంబంధించిన ప్రాజెక్టు స్మా ర్ట్ న్యూట్రియంట్ మేనేజ్మెంట్ ఆఫ్ సాయిల్‌కు గోల్డ్ ఐకాన్ అవార్డు వరించిందన్నారు. టెక్నాలజీలను వ్యవసా యం, ఆరోగ్య సంరక్షణ, పర్యావర ణం, రవాణ వంటి రంగాలతోపాటు మరిన్ని రంగాలకు వర్తించేలా రాష్ట్ర ప్ర భుత్వం ప్రోత్సాహక కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ తెలిపారు.