హైదరాబాద్, డిసెంబర్ 4 (నమస్తే తెలంగాణ) : సత్వర సాగునీటి ప్రాయోజిత కార్యక్రమం (ఏఐబీపీ)లో చిన్నకాళేశ్వరం ప్రాజెక్టును చేర్చేందుకు కేంద్రం సుముఖత వ్యక్తంచేసింది. ఇటీవల ఇరిగేషన్ అధికారులు పంపిన ప్రతిపాదనలకు కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) ఆమోదం తెలిపింది. దీంతో ప్రాజెక్టుకు కేంద్రం రూ.233 కోట్ల నిధులను విడుదల చేయనుంది. ఏఐబీపీ-2 ఫేజ్‌లో రాష్ట్రంలో ఇప్పటికే 29 ప్రాజెక్టులను చేర్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన అనంతరం వాటికి అదనంగా మరో 3 ప్రాజెక్టులను ఆ ప్రోగ్రామ్‌లో చేర్చాలని నిర్ణయించింది. ఏఐబీపీ మార్గదర్శకాలకు అనుగుణంగా కేంద్ర జల శక్తిశాఖ టెక్నికల్ అడ్వయిజరీ కమిటీ అనుమతులు సాధించింది.
హైదరాబాద్, డిసెంబర్ 4 (నమస్తేతెలంగాణ): చెరకు టన్నుకు రూ.4వే లు, బోనస్ రూ.వెయ్యి అందించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ చెరకు రైతుసంఘం రాష్ట్రకమిటీ ఆధ్వర్యంలో రైతు లు ఆందోళనకు దిగారు. హైదరాబాద్ షుగర్‌కేన్ కమిషనర్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. అనంతరం అదనపు కమిషనర్‌కు వినతి పత్రం అందజేశారు. సంఘం రాష్ట్రప్రధాన కార్యదర్శి రాం బాబు మాట్లాడుతూ.. రైతులను ఆదుకునేందుకు రాష్ట్రప్రభుత్వం రూ.వెయ్యి బోనస్‌గా ఇవ్వాలని డిమాండ్ చేశారు.