హైదరాబాద్: మాండూస్ తుఫాను ప్రభావంతో హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తున్నది. ఆదివారం సాయంత్రం నగరంలో భారీ వాన పడిన విషయం తెలిసిందే. ఇక సోమవారం ఉదయం నుంచి రాజధానిలో జల్లులు కురుస్తున్నాయి. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిలింనగర్, మాదాపూర్, హైటెక్ సిటీ, కొండాపూర్, గచ్చిబౌలి, గోల్కొండ, లంగర్‌హౌస్, మెహిదీపట్నం, నాంపల్లి, ఖైరతాబాద్, ట్యాంక్‌బండ్, హిమాయత్‌నగర్, నారాయణగూడ, ఉప్పల్, బండ్లగూడ, హయత్‌నగర్, సరూర్‌నగర్‌లో మోస్తరుగా వాన పడుతున్నది.
కాగా రాగల మూడు రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. సోమవారం పలు ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వానలు పడుతాయని పేర్కొన్నది. తూర్పు, ఆగ్నేయ దిశల నుంచి రాష్ట్రంలోకి గాలులు వీస్తున్నాయని, ఈ ప్రభావంతో ఉష్ణోగ్రతలు పడిపోయి చలి తీవ్రత పెరుగుతున్నదని చెప్పింది.