మాది పంజాబ్. మా తమ్ముడు గురుప్రీత్‌సింగ్ ఇక్కడ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. సొరంగం ప్రమాదంలో మా తమ్ముడు లోపల చిక్కుకున్నాడు. బాధితుల ప్రాణాలంటే ప్రభుత్వానికి లెక్కలేదా? మాది నిరుపేద కుటుంబం. మా తమ్ముడిని కాపాడుతారని అనుకున్నాం.
కానీ ఈ ప్రభుత్వం కాపాడేలా కనిపించడం లేదు. సహాయ చర్యలు అంతంత మాత్రంగానే చేస్తున్నారు. ఇక్కడికి వచ్చిన మమ్మల్ని పట్టించుకోవడం లేదు. సమాచారం సరిగా ఇవ్వడం లేదు. టన్నెల్ దగ్గరికి వచ్చి చూస్తే అసలు సహాయ చర్యలు చేస్తున్నారా లేదా? అని అనుమానం కలుగుతున్నది.
– సత్పాల్సింగ్, బాధితుడి సోదరుడు, పంజాబ్