SLBC Tunnel | ఎస్ఎల్బీసీ టన్నెల్ కూలి నేటికి సరిగ్గా ఐదు నెలలు ! ప్రమాదంలో సజీవ సమాధి అయిన కార్మికుల మృతదేహాలు నేటికీ దొరకలేదు. దానికితోడు ఇప్పుడు మొత్తం ప్రాజెక్టే అటకెక్కే పరిస్థితి నెలకొన్నది. అమెరికా నుంచి కష్టపడి టన్నెల్ బోర్ మెషీన్ బేరింగులు తెచ్చిన అధికారులు.. దాని పార్ట్లు మాయమైనట్లు గుర్తించారు. వాటిని మరోవైపున ఉన్న మెషీన్‌కు పెట్టామని, అది కాస్తా ఫిబ్రవరి 21 నాటి ప్రమాదంలో మట్టి కింద కూరుకుపోయిందని తేల్చారు. ఇప్పుడిక ఎస్ఎల్బీసీ కథ కంచికి చేరినట్టే!!
(గుండాల కృష్ణ) హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, జూలై 20 (నమస్తే తెలంగాణ): ‘హస్తవాసి కోసం పోతే రిస్ట్ వాచీ పోయిందట!’ ప్రస్తుతం కాంగ్రెస్ సర్కార్ పరిస్థితి అట్లనే ఉన్నది. మరో మూడేండ్లయినా ఎస్ఎల్బీసీ సొరంగం పనులు తిరిగి మొదలయ్యే సూచనలు కనిపిం చకపోగా.. ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ మాత్రం మొత్తం ప్రాజెక్టునే మూడేండ్లలో పూర్తి చేస్తామంటూ ఉత్త బీరాలు పలుకుతున్నారు. 2008లో మొదలుపెట్టిన శ్రీశైలం ఎడమగట్టు కాలువ పనులు 17 ఏండ్లయినా పూర్తిచేయని కాంగ్రెస్ పాలకుల నిర్వాకం తెలిసినవాళ్లు మాత్రం.. మూడేండ్లలో ప్రాజెక్టు పూర్తిచేస్తా మన్న మంత్రి మాటలు విని లోలోపల నవ్వు కుంటున్నారు.
‘ఎస్ఎల్బీసీ సొరంగం పను లను పునరుద్ధరిస్తాం. డెన్మార్క్ నుంచి అత్యా ధునిక సాంకేతిక పరికరాలు తెచ్చి, ఆర్మీ హెలి కాప్టర్ సర్వే చేయిస్తాం. మూడేండ్లలో సొరంగం పనులను పూర్తిచేస్తాం’ అని మంత్రి ఉత్తమ్ మీడియాకు వాకృచ్చారు. ఆయన చెప్తు న్నట్టు ఆర్మీ హెలికాప్టర్లు, అత్యాధునిక పరికరాలు, రాడార్ సర్వేల మాటల హంగామా పక్కనబెడితే.. అసలు సొరంగం తవ్వాలంటే ముందు టన్నెల్ బోరింగ్ మిషన్ (టీబీఎం) నడవాలి కదా! సమస్యంతా అక్కడే ఉన్నది. ఒకవైపున ఉన్న టీబీఎం మిషన్‌కు విడిభాగాలు లేవు. వాటిని తీసుకెళ్లి రెండవ వైపున ఉన్న టీబీఎం మిషన్‌కు పెట్టగా..150 రోజుల కిందట (ఫిబ్రవరి 22న) అది కాస్తా సొరంగం కూలి మట్టిలో కూరుకుపోయింది. ఇప్పుడు దాన్ని బయటకు తీయలేరు. అది చేయగలి గేంత శక్తి ఉంటే.. ఆరుగురు కార్మికులు శవాలు ఎప్పుడో బయటపడేవి! పోనీ కొత్త టీబీఎం తీసుకువద్దామంటే.. దాని తయారీకే మూడేండ్లు పడుతుంది. అడకత్తెరలో పోకచెక్క పరిస్థితి! ఎస్ఎల్బీసీ సొరంగంలో ఇరుక్కు పోయి.. ఎటూ బయటకురాలేని టీబీఎం మిష న్ లా తయారైంది కాంగ్రెస్ సర్కారు పరిస్థితి! ముందుకు వెళ్లలేదు.. వెనక్కీరాలేదు!
2 టీబీఎంలు.. రెండువైపులా పనులు
ఎస్ఎల్బీసీ ప్రాజెక్టులో భాగంగా ఇన్లెట్ (శ్రీశైలం) వైపు నుంచి, అవుట్లెట్ (నాగర్ క ర్నూల్) వైపు నుంచి ఏకకాలంలో టీబీఎంల ద్వారా తవ్వకాలు ప్రారంభించిన సంగతి తెలి సిందే. సొరంగం-1 పొడవు 43.5 కిలోమీ టర్లు. 2008లో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం పనులు మొదలు పెట్టి, 2014 వరకు 22.890 కిలోమీటర్లు తవ్వింది. తర్వాత కేసీ ఆర్ ప్రభుత్వం పదేండ్లలో 11.482 కిలోమీ టర్లు తవ్వి, 7.5 టీఎంసీల సామర్థ్యంతో నక్క లగండి రిజర్వాయర్, పెండ్లిపాకల రిజర్వా యర్ల నిర్మాణాలను పూర్తి చేసింది. 2023 ఫిబ్రవరిలో తవ్వకం పనులు నిలిచిపో యాయి. 13.9 కిలోమీటరు వద్ద ఎనిమిది మీటర్ల షియర్ జోన్ రావడంతో అన్నిరకాల జాగ్రత్తలు తీసుకున్న తర్వాతే పనులు కొనసా గించాలని కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయించింది. అవుట్లెట్ నుంచి తవ్వుకుంటూ వస్తున్న టీబీఎం బేరింగ్ చెడిపోవడంతో ఆ పనులు 2023 జనవరిలో నిలిచిపోయాయి. వాస్తవా నికి టీబీఎం ప్రధాన బేరింగ్ తెలంగాణ ఏర్ప డేనాటికే ఒకసారి చెడిపోయింది. 2018లో రెండోసారి విఫలమైంది. విదేశాల నుంచి మెయిన్ బేరింగ్ తీసుకొచ్చి 2021లో పను లను పునరుద్ధరించారు. అదే ఏడాది నవంబ ర్లో మరోసారి మెయిన్ బేరింగ్ మరమ్మతు
లకు గురికాగా 6 నెలలు పనులు ఆగిపోయాయి. 2022 జూన్‌లో మళ్లీ కొనసాగాయి. 2023 జనవరిలో ఇంకోసారి బేరింగ్ చెడిపో వడంతో నిర్మాణ సంస్థ పనులు నిలిపివేసింది. ప్రధాన బేరింగ్‌తోపాటు రింగేర్, అడాప్టర్, ఇతర విడిభాగాలు మార్చాలని చెప్పింది. నిర్మాణ సంస్థే విడిభాగాల్ని తెచ్చుకోవాలి. కానీ కంపెనీ దివాలా తీయడంతో అమెరికాలోని రాబిన్సన్ కంపెనీకి డబ్బులను చెల్లించలేదు. దీంతో యంత్ర పరికరాలు రాలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేనాటికి రెండు వైపులా పనులు నిలిచిపోయి ఉన్నాయి.
బేరింగ్ వచ్చే.. పార్టులు పాయె.. ఢాం ఢాం ఢాం!
శ్రీశైలం వైపు నుంచి ఇన్లెట్ 13.900 కిలోమీటరు వద్ద సొరంగం కుప్పకూలి టీబీఎం ధ్వంసమైన సంగతి తెలిసిందే. సహాయ చర్యల్లో భాగంగా యంత్రాన్ని ముక్క లుగా చేశారు. నాగర్ కర్నూల్ వైపు అవుట్లెట్ వద్ద ఉన్న టీబీఎం బేరింగ్ నెలన్నర కిందట వచ్చేసింది. దీంతో అటువైపు నుంచి పనులు మొదలవుతాయని అంతా భావించారు. కానీ, ఇక్కడే అందరూ అవాక్కయ్యే కథ బయటప డినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. టీబీ ఎంలో మరికొన్ని విడి భాగాలు కావాలని, ఇందుకు రూ.70 కోట్ల అడ్వాన్స్ ఇవ్వాలని నిర్మాణ సంస్థ జేపీ అసోసియేట్స్ కొంతకాలం కిందట ప్రభుత్వాన్ని కోరింది. ఐదు దేశాల నుంచి ఈ విడిభాగాలను తెప్పించాల్సి ఉంటుందని సమాచారం. బేరింగ్‌తో పాటే ఆ విడిభాగాలకు కూడా ఆర్డర్ ఇవ్వాల్సి ఉన్నది. కానీ, బేరింగ్ కోసం ఆర్డర్ ఇచ్చేనాటికి ఆ విడి భాగాలు టీబీఎంకు ఉన్నాయని విశ్వసనీ యంగా తెలిసింది. ఆ భాగాలు ఇప్పుడు లేవని చెప్తున్నారు. మరి ఏమయ్యాయి? అన్న ప్రశ్నలు తలెత్తాయి. ఇక్కడే కంపెనీ చేసిన ఘన కార్యం ఒకటి బయటపడిందని చెప్తున్నారు. అవుట్లెట్ వైపు పనులు మొదలు పెట్టా లంటూ ప్రభుత్వం నుంచి వస్తున్న ఒత్తిడిని తప్పించుకునేందుకు నిర్మాణసంస్థ శ్రీశైలం వైపు పనులు మొదలు పెట్టాలని భావించిం దట. అయితే టీబీఎం నెలల తరబడి నీళ్లలో నానడంతో చాలా విడిభాగాలు చెడిపోయా యని తెలిసింది. దీంతో నాగర్ కర్నూల్ వైపు ఉన్న టీబీఎంలో నుంచి ఆ విడి భాగాలను తొలగించి, శ్రీశైలం వైపు ఉన్న దానికి అమర్చా రని విశ్వసనీయ వర్గాల సమాచారం. చివరకు సొరంగం కుప్పకూలడంతో టీబీఎంతో సహా అమర్చిన విడిభాగాలు ధ్వంసం అయ్యాయి. దీంతో ఇప్పుడు నాగర్ కర్నూల్ వైపు ఉన్న టీబీ ఎంకు బేరింగ్ వచ్చినా, విడి భాగాలు లేకపో వడంతో పనులు మొదలు పెట్టలేని పరిస్థితి నెలకొన్నది. ఇదే విషయాన్ని నిర్మాణ సంస్థ ప్రభుత్వ పెద్దలకు చేరవేసిందని సమాచారం.
హడావుడి సమీక్షలు.. కంపెనీపై ఒత్తిడి
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ‘నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితోపాటు జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఎస్ఎల్సీపై వరుస సమీ క్షలు చేపట్టారు. నిర్మాణ సంస్థకు అడ్వాన్సుగా డబ్బులు ఇచ్చి బేరింగ్‌కు ఆర్డర్ ఇస్తామన్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఏకంగా అమెరికా వెళ్లి రాబిన్సన్ కంపెనీ ప్రతినిధులతో మాట్లాడి, బేరింగ్ తయారీని పరిశీలించారట. బేరింగ్ వచ్చేసిందని, కేసీఆర్ ప్రభుత్వం చేయని ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును మేం పూర్తిచేస్తామంటూ పదేపదే ప్రకటనలు చేశారు. 2024 అక్టోబరులో బేరింగ్‌ను అమర్చి అవుట్లెట్ పనులు మొదలుపెడతామని జేపీ కంపెనీ ప్రభు త్వానికి చెప్పింది. గడువులోగా పనులు ప్రారంభం కాకపోవడంతో మంత్రులు నిర్మాణ సంస్థపై తీవ్ర ఒత్తిడి చేసినట్టు చెప్తున్నారు. అసలే దివాళా తీసిన కంపెనీ, ఆపై ప్రభుత్వం అడ్వాన్సుగా చెల్లించిన మొత్తంలో పరికరాలకు ఎంత చెల్లించారో, ఎవరెవరికి వాటాలు వెళ్లాలో తెలియని పరిస్థితి. దీంతో బేరింగ్ ఇప్పట్లో వచ్చేలా లేదని కంపెనీకి అర్థమైంది. మరోవైపు ప్రభుత్వం నుంచి ఒత్తిడి పెరిగిపోవడంతో పనులను పునరుద్ధరించినట్టు చూపెట్ట డానికి అవుట్‌లెట్‌ను వదిలి, శ్రీశైలం వైపు పనుల్ని ప్రారంభించింది. ఈ ఏడాది ఫిబ్రవరి 16-17 తేదీల్లో పనులు మొదలుకాగా, 21వ తేదీ నాటికి 18 మీటర్ల సొరంగం తవ్వారు.
కవరింగ్ కోసం ‘ఉత్త’ హడావుడి
నిర్మాణ సంస్థ చెప్పిన కథతో మంత్రులకు దిమ్మతిరిగిందట. అందుకే ఎస్ఎల్బీసీపై వారంతా గప్‌చుప్ గా ఉంటున్నారని చర్చ జరు గుతున్నది. దీనిని కవర్ చేసేందుకు మంత్రి ఉత్తమకుమార్ రెడ్డి తంటాలు పడుతున్నారని చెప్పుకుంటున్నారు. ఇందులో భాగంగానే ఢిల్లీకి వెళ్లి కేంద్రప్రభుత్వం, ఆర్మీ అధికారు లతో మాట్లాడి, ఎస్ఎల్బీసీ పనుల్ని పునరుద్ధ రించి మూడేండ్లలో పూర్తి చేస్తామంటూ చెప్పా రని అంటున్నారు. అవుట్లెట్ పనులు ఎందుకు ఆగిపోయాయని ప్రశ్నిస్తే.. సొరంగం కుప్పకూలిన నేపథ్యంలో 44 కిలోమీటర్లు సర్వే చేయిస్తామని చెప్పుకొస్తున్నారు. వాస్తవా నికి గతంలోనే పక్కా సర్వే జరిగిందని సాగునీ టిరంగ నిపుణులు పేర్కొంటున్నారు. గతంలో ఎన్టీఆర్, జీఎస్ఐ, ఇతర విభాగాల నిపుణు లతో సమగ్రంగా అధ్యయనం చేసిన తర్వాతనే సొరంగం అలైన్ మెంట్ ఖరారు చేశారని వారంటున్నారు. ‘శ్రీశైలం వైపు నుంచి మొద లయ్యే సొరంగం మధ్యలో ఒక నీటివనరు దగ్గర భూ ఉపరితలానికి వచ్చి ఓపెన్ అయ్యేలా ఉందని అప్పట్లో గుర్తించారు. ఆ తర్వాత ఇంజినీర్లు క్షేత్రస్థాయికి వెళ్లి దానిని నిర్ధారించుకున్న తర్వాత అలైన్మెంట్లో మార్పు చేశారు’ అని వారు గుర్తుచేస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో సొరంగం కుప్పకూలిన ప్రాంతంలో ఎనిమిది మీటర్ల షియర్ జోన్ ఉన్నదని ముందుగానే గుర్తించారన్నారు. ఇప్ప టివరకు పూర్తయిన సొరంగ నిర్మాణంలో పలు చోట్ల స్వల్ప షియర్ జోన్లు ఉన్నాయి. వాటిని కూడా ముందుగానే గుర్తించడం వల్లే తగిన చర్యలు తీసుకుని నిర్మాణాన్ని కొనసాగించా రని వివరిస్తున్నారు. మంత్రి ఉత్తమకుమార్ రెడ్డి చెప్తున్నట్టు అత్యాధునిక పరికరాలు, ఆర్మీ హెలికాప్టర్లతో 44 కిలోమీటర్ల సర్వే చేయిం చినా మళ్లీ టీబీఎంలతోనే మిగిలిన 9.5 కిలో మీటర్లు డ్రిల్లింగ్ చేయాల్సి ఉంటుందని నిపు ణులు చెప్తున్నారు. టైగర్ రిజర్వు ఫారెస్టు కావ డంతో బ్లాస్టింగ్‌కు కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖ అనుమతి ఇవ్వడం అసాధ్య మని చెప్తున్నారు. 44 కిలోమీటర్ల సొరంగంలో ఒక్కో యంత్రం 22 కిలోమీటర్లు తవ్వాల్సి ఉంటుంది. ఈ మేరకే రాబిన్సన్ కంపెనీ వాటిని తయారు చేసింది. నాగర్ కర్నూల్ వైపు టీబీఎం ఇప్పటికే 20 కిలోమీటర్ల డ్రిల్లింగ్ పూర్తి చేసింది. మరో రెండు కిలోమీటర్ల వరకు అది చేయగలదు. అదనంగా ప్రయత్నిస్తే ఒక టిరెండు కిలోమీటర్లు తప్ప ముందుకు కదల దని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఇక ఇన్ లెట్ వైపు 13.9 కిలోమీటర్ల డ్రిల్లింగ్ పూర్త యింది. సొరంగం కుప్పకూలిన ఘటన తర్వాత ధ్వంసమైన టీబీఎం స్థానంలో కొత్తది అమర్చడం అసాధ్యమని తేల్చేశారు. పైగా కుప్పకూలిన చోట దాదాపు 50 మీటర్లు అత్యంత సంక్లిష్టంగా ఉన్నట్టు చెప్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇన్లెట్, అవుట్లెట్ మధ్యలో మిగిలిపోతున్న 9 కిలోమీటర్లకుపైగా సొరంగాన్ని ఎలా తవ్వుతారని ప్రశ్నిస్తున్నారు. కాబట్టి త్వరలో పనులు చేపడుతామంటూ ప్రభుత్వం చేస్తున్నదంతా ఉత్త హడావుడేనని ఇరిగేషన్ నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
అదిగదిగో.. అమెరికా మేడ్ బేరింగ్!
ఎస్సెల్బీసీలో రెండు టీబీఎంలు ఉండేవి. రెండువైపులా నుంచి సొరంగం తవ్వేందుకు వాటిని వాడారు. శ్రీశైలం వైపున ఉన్న మిషన్.. సొరంగం కూలిన ఘటనలో తుక్కుతుక్కయ్యింది. రెండోది నాగర్‌కర్నూల్ జిల్లా వైపున ఉన్న అవుట్ లెట్ టన్నెల్లో ఉన్నది. అసలు సొరంగ రహస్యం ఇక్కడే దాగి ఉన్నది. వాస్తవా నికి కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రెండో టీబీఎంనే పరుగులు పెట్టిస్తామని ప్రభుత్వ పెద్దలు హంగామా చేశారు. ఒక మంత్రి ఏకంగా అమెరికా వెళ్లి టీబీఎం బేరింగ్ తయారీని స్వయంగా పరిశీ లించి వచ్చారు. ‘బేరింగ్ అదిగో.. ఇదిగో’ అంటూ ఏడాదిపాటు ఊరిం చారు. చివరికి బేరింగ్ రాకపోవడంతో దాన్ని అలా ఉంచేసి.. శ్రీశైలం వైపు ఉన్న టీబీఎంతో సొరంగం తవ్వడం మొదలు పెట్టారు. అదీ మూణ్నాళ్ల ముచ్చటే అయ్యింది. సొరంగం కుప్పకూలడంతో అదికాస్తా తుక్కుతుక్కయ్యింది. ఎట్టకే లకు రెండో యంత్రానికి సంబంధించిన బేరింగ్ వచ్చిందంటూ అధికారులు నెల న్నర కిందట ప్రకటించారు. కానీ, ఇప్ప టికీ ఆ బేరింగ్‌ను ఎందుకు అమర్చడం లేదు? ఎందుకు డ్రిల్లింగ్ మొదలుపె ట్టడం లేదు? అని సాగునీటిరంగ నిపు ణులు అనుమానిస్తున్నారు. శ్రీశైలం వైపు దుర్ఘటన జరిగింది కాబట్టి, సర్వే చేసిన తర్వాత మొదలుపెడదామని ప్రభుత్వ పెద్దలు చెప్పి తప్పించుకునే అవకాశం ఉన్నది. కానీ బేరింగ్ వచ్చినా రెండో టీబీఎం ఇంచు కూడా ముందుకు కదలకపోవడం వెనక పెద్ద కథ ఉన్నదని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.