హైదరాబాద్, నవంబర్ 23 (నమస్తే తెలంగాణ): పరిశ్రమల స్థాపనకు సులువుగా అనుమతులిస్తున్న టీఎస్ ఐపాస్ ప్రతిష్ఠాత్మక స్కోచ్ ఫౌండేషన్ అవార్డుకు ఎంపికైంది. మంగళవారం సాయంత్రం స్కోచ్ ఫౌండేషన్ నిర్వహించిన ఆన్లైన్ పోటీలో టీఎస్ ఐపాస్‌ను అవార్డుకు ఎంపికచేశారు.
టీఎస్ ఐపాస్ ద్వారా 2015 నుంచి ఇప్పటివరకు తయారీరంగంలో 19,692, సేవల రంగంలో 2,156 సంస్థలకు అనుమతులు మంజూరు చేశారు. వీటి ద్వారా రూ.2,50,849 కోట్ల పెట్టుబడులు, 17,18,311 మందికి ఉద్యోగావకాశాలు లభించాయి.