తెలంగాణ-ఛత్తీస్గఢ్ రాష్ర్టాల సరిహద్దులోని అటవీ ప్రాంతంలో మందు పాతర్లను అమర్చుతున్న ఆరుగురు మావోయిస్టులను ములుగు పోలీసులు అరెస్టు చేశారు. మావోయిస్టుల కదలికలపై పక్కా సమాచారంతో వెంకటాపురం మండలం తడపాల అటవీ ప్రాంతంలో పోలీసులుక ఊంబింగ్ నిర్వంహించారు. ఈ క్రమంలో మందుపాతరలను అమర్చుతున్న ఆరుగురు మావోయిస్టులు పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నించారు. అయితే వారిని వెంబడించిన పోలీసులు వారిని పట్టుకున్నారు. పట్టుబడిన మావోయిస్టుల్లో ఇద్దరు మహిళలు, నలుగురు పురుషులు ఉన్నారు. వారి దగ్గర నుంచి ఒక డీబీబీఎల్ తుపాకీ, నాలుగు కిట్ బ్యాగులు, రెండు వాకీ టాకీలు, పేలుడు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.