హుస్నాబాద్, జనవరి 10: కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను ఖజానాకు లింకుపెట్టకుండా అమలు చేయాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి అన్నారు. బుధవారం హుస్నాబాద్‌లోని అనభేరి సింగిరెడ్డి అమరుల భవన్లో మీడియా సమావేశంలో మాట్లాడారు.
రాష్ట్రంలోని ప్రజాస్వామ్యవాదులు, మేధావులు, ఉద్యమకారుల అండదండలతో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం వారి ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాలని సూచించారు.