మహదేవపూర్, జూన్ 7: ఈతకు వెళ్లి ఆరుగురు యువకులు గల్లంతైన ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండల పరిధి అంబట్‌పల్లిలోని మేడిగడ్డ బరాజ్‌వద్ద జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. శనివారం 8మంది స్నేహితులు మేడిగడ్డ బరాజ్‌లోకి ఈతకు వెళ్లారు. వారిలో ఆరుగురు గల్లంతు కాగా, ఇద్దరు ప్రాణాలతో బయటపడ్డారు. అంబట్పల్లికి చెందిన పత్తి మధుసూదన్ (18), పట్టి శివమనోజ్ (15), తొగరి రక్షిత్ (13), కర్నాల సాగర్ (16), మ హాముత్తారం మండలం కొర్లకుంటకు చెందిన పండు (18), రాహుల్ (19) మేడిగడ్డ బరాజ్‌లోకి ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు గల్లంతయ్యారు. వారితోపాటు వెళ్లిన పట్టి శివమణి, పట్టి వెంకటస్వామి సురక్షితంగా బయటపడ్డారు. కాటారం డీఎస్పీ రామ్మోహన్‌రెడ్డి, ఎస్సై పవన్‌కుమార్ ఘటనా స్థలానికి చేరుకొని గాలింపుచర్యలు చేపడుతున్నారు. కాటా రం సబ్‌కలెక్టర్ మయాంక్‌సింగ్ సహాయక చర్యలపై ఆరా తీశారు. సింగరేణి రెస్క్యూ టీం గాలింపు చర్యలు చేపడుతున్నది. గల్లంతైన వారి కోసం కుటుంబీకులు కన్నీరు ము న్నీరయ్యారు.
భూపాలపల్లి రూరల్, జూన్ 7 : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని గోదావరి పరీవాహక ప్రాంతాల్లో ఈత కొట్టడం, ఫొటోలు, వీడియోలు తీయడంపై నిషేధం విధించినట్టు జిల్లా ఇన్చార్జి కలెక్టర్ టీఎస్ దివాకర తెలిపారు. గోదావరిలో ఈత కొట్టడం, ఫొటోలు దిగడం, సోషల్ మీడియా కోసం వీడియోలు తీయడం వంటి వాటితో ప్రమాదాలు జరు గుతున్నాయని పేర్కొన్నారు.