మల్లాపూర్, ఫిబ్రవరి 19: నాసా (నేషనల్ ఎరోనాటికల్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్) పరీక్షలో జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం సిరిపూర్ గ్రామానికి చెందిన ఎడ్మల శ్రీహన్‌రెడ్డి సత్తాచాటాడు. నాసా ఆధ్వర్యంలో నిర్వహించిన బ్రైటెస్ట్ మైండ్స్ ఆఫ్ వరల్డ్ ఐదో స్థాయి పరీక్షల్లో ఎడ్మల సునీల్‌కుమార్-లక్ష్మీ దంపతుల కుమారుడు శ్రీహన్‌రెడ్డి అంతర్జాతీయ స్థాయిలో మొట్టమొదటి ర్యాంక్ సాధించాడు. దీంతో ఆ విద్యార్థి అమెరికాలోని నాసా కేంద్రాన్ని సందర్శించేందుకు అర్హత పొందాడు. ప్రస్తుతం అతను మెట్‌పల్లిలోని బ్రిలియంట్ గ్రామర్ స్కూల్లో పదోతరగతి చదువుతున్నాడు. ఈ సందర్భంగా ఆ విద్యార్థిని పలువురు అభినందించారు.