హైదరాబాద్, జనవరి 27 (నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావును డిబేట్‌కు పిలిచి, ఏబీఎన్-ఆంధ్రజ్యోతి వ్యాఖ్యాత అవమానించారని, ఆయన వ్యవహార శైలిని తీవ్రంగా ఖండిస్తున్నామని శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి ఆగ్రహం వ్యక్తంచేశారు. సిరికొండ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు దేశపతి శ్రీనివాస్, రవీందర్రావు మంగళవారం శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డిని కలిశారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి డిబేట్లో తనకు జరిగిన అవమానంపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ రవీందర్రావు ఫిర్యాదు పత్రం అందచేశారు. అనంతరం మండలి మీడియా పాయింట్లో మధుసూదనాచారి మాట్లాడుతూ బీఆర్ఎస్పై కుట్రతోనే తమ పార్టీ ఎమ్మెల్సీపై కావాలనే ఏబీఎన్ వ్యాఖ్యాత అనుచిత వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. ఒక ఎమ్మెల్సీని డిబేట్‌కు పిలిచి.. ఈ విధంగా అవమానించడాన్ని ఖండిస్తున్నట్టు చెప్పారు. ‘బీఆర్ఎస్ మీద ఉన్న కుట్రతో డిబేట్లో ఆ వ్యాఖ్యాత వ్యవహరించడాన్ని ఎమ్మెల్సీ రవీందర్రావు అడ్డుకున్నారు.. ఈ నెపంతోనే ఆయన మీద ఏబీఎన్ వ్యాఖ్యాత అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇది ఒక్క రవీందర్‌రావుపై జరిగిన దాడి కాకుండా, శాసనమండలిలో మొత్తం సభ్యుల మీద జరిగిన దాడిగా భావించి ఏబీఎన్ వ్యాఖ్యాత వెంకటకృష్ణపై చర్యలు తీసుకోవాలి’ అని మండలి చైర్మన్ సుఖేందర్‌రెడ్డిని కోరినట్టు తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా చైర్మన్ నుంచి తగిన చర్యలు ఉంటాయని తాను ఆశిస్తున్నట్టు చెప్పారు.
బీఆర్ఎస్పై బురద చల్లే యత్నం : రవీందర్రావు
జరగనివి జరిగినట్టుగా ఏబీఎన్ టీవీ డిబేట్లో చూపించే ప్రయత్నం చేశారని, తాను దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశానని, బీఆర్ఎస్ నేతలపై కావాలనే బురదజల్లే ప్రయత్నం చేశారని ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు మండిపడ్డారు. ఆ డిబేట్లో భాగంగా పిచ్చి రాతలు, విష ప్రచారం చేసే వారిపైనే తాను మాట్లాడానని వివరించారు. ఆ డిబేట్‌కు తనను గెస్ట్‌గా పిలిచి, అవమానించడం కలచివేసింది ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఎక్కడా అన్‌పార్లమెంటరీ పదాలను వాడలేదని తెలిపారు. ఒక అతిథి పట్ల టీవీ వ్యాఖ్యాత ఈ విధంగా వ్యవహరించడం దుర్మార్గమని మండిపడ్డారు. తన స్థాయిని దిగజార్చడం వల్ల తన మనసు కలచివేసిందని భావోద్వేగానికి గురయ్యారు. తనకు జరిగిన అవమానంపై తెలంగాణ ప్రజలతో పాటు తమ పార్టీ తనకు అండగా నిలిచిందని చెప్పారు. పార్టీ సమావేశాలకు ఏబీఎన్‌ను బాయ్‌కాట్ చేసి తనకు మద్దతుగా నిలిచిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పార్టీ నేతలకు కృతజ్ఞతలు తెలిపారు.
ఏబీఎన్ తెలంగాణ వ్యతిరేకి: దేశపతి
ఏబీఎన్-ఆంధ్రజ్యోతి చానల్ మొదటి నుంచీ తెలంగాణ వ్యతిరేకతను ప్రదర్శిస్తున్నదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ ధ్వజమెత్తారు. మొదటి నుంచీ తెలంగాణ ఉద్యమానికి నష్టం జరిగేలా చేయడమే కాకుండా.. తమ నాయకుడు కేసీఆర్‌పై విష ప్రచారం చేశారని మండిపడ్డారు. తప్పుడు ప్రచారం చేస్తున్న చానళ్లు, పత్రికలు, మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేసిన రవీందర్‌రావుపై ఏబీఎన్ వ్యాఖ్యాత దురుసుగా వ్యవహరించడాన్ని ఖండిస్తున్నట్టు చెప్పారు.
‘మై డిబేట్’ అని అనడం ఏంటీ..
‘ప్రజలకు సంబంధించి చర్చలు జరిగే డిబేట్‌ను, ‘మై డిబేట్’ అనడం ఏంటీ? ఇది చాలా కొత్తగా ఉంది’ అని దేశపతి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. పైగా ‘గెట్ అవుట్ టు మై డిబేట్’ అని అనడం ఆ వ్యాఖ్యాత దురహంకారానికి నిదర్శనమని ఆగ్రహం వ్యక్తంచేశారు. వచ్చిన గెస్ట్‌ల పట్ల ఇలా దురుసుగా మాట్లాడటం ఇప్పుడు ట్రెండ్‌గా మారిందని దుయ్యబట్టారు. ఇది ఒక్క ఎమ్మెల్సీ రవీందర్‌రావుకు జరిగిన అవమానమే కాకుండా శాసనమండలి సభ్యులకు జరిగిన అవమానంగా భావించి చర్యలు తీసుకోవాలని మండలి చైర్మన్ దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిపారు.
మండలి చైర్మన్కుబీఆర్ఎస్ ఎమ్మెల్సీలు చేసిన విజ్ఞప్తులు