పంట పొలాల్లో మంటలు.. కాలిబూడిదైన మక్కలు, వడ్లు, పైపులు, మోటర్లు
జయశంకర్భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం వెల్లంపల్లి, బండపల్లి, కుందనపల్లి, పెద్దంపల్లి పంట పొలాల్లో శుక్రవారం మంటలు చెలరేగాయి. గ్రామస్తులు ఆర్పే ప్రయత్నం చేసినప్పటికీ ఎండ వేడితోపాటు బలంగా గాలులు వీచడం తో మంటలు వ్యాపించాయి. 15 క్విం టాళ్ల మక్కలు, 15 మామిడి చెట్లు కాలిపోగా, వివిధ రైతుల మోటర్ వైర్లు, పైపులు కాలిపోయాయి.
- అధికారులను అప్రమత్తం చేసిన ఎమ్మెల్సీ సిరికొండ
టేకుమట్ల, మే 22: జయశంకర్భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం వెల్లంపల్లి, బండపల్లి, కుందనపల్లి, పెద్దంపల్లి పంట పొలాల్లో శుక్రవారం మంటలు చెలరేగాయి. గ్రామస్తులు ఆర్పే ప్రయత్నం చేసినప్పటికీ ఎండ వేడితోపాటు బలంగా గాలులు వీచడం తో మంటలు వ్యాపించాయి. 15 క్విం టాళ్ల మక్కలు, 15 మామిడి చెట్లు కాలిపోగా, వివిధ రైతుల మోటర్ వైర్లు, పైపులు కాలిపోయాయి. పెద్దంపల్లి శివారులో జరిగిన అగ్నిప్రమాదంలో బస్తాల్లో ఎత్తిన 60 క్వింటాళ్ల మక్కలు, 2 ఎకరాల వరి పొలం, 20 వడ్ల బస్తాలు, మోటర్ వైర్లు, పైపులు కాలి పోయాయని బాధిత రైతు దాసరి భాస్కర్ ఆవేదన వ్యక్తం చేశాడు.
విషయం తెలుసుకున్న శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదచారి ఆయా గ్రామస్తుల నుంచి ప్రమాద తీవ్రతను అడిగి తెలుసుకున్నారు. అనంతరం జిల్లా కలెక్టర్, ఎస్పీ, సింగరేణి జీఎంలతో ఫోన్లో మాట్లాడి మంటల గురించి వివరించి, ఫైరింజన్లు పంపించాలని కోరారు. అదే విధంగా వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం కొండాపూర్ గ్రామంలో ఓ రైతు తన పంట అవశేషాలను కాల్చేందుకు శుక్రవారం నిప్పంటించాడు. ఎండల తీవ్రతతో పాటు వడగాలులకు సుమారు 5వందల ఎకరాల వరకు మంట వ్యాపించాయి. డ్రిప్ పైపులు, కరెంట్ మోటర్లు, స్టాటర్లు, కేబుల్ వైర్లు, పంటలకు నీరందించే పైపులు, బోరు మోటర్లు అగ్నికి ఆహుతయ్యాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jobs | ఇండియన్ ఆర్మీలో 10+2 టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ 57.. జేఈఈ మెయిన్ స్కోర్‌తో ప్రవేశాలు
Rajamouli | అమెరికాలో రాజమౌళి.. ‘వారణాసి’ షూటింగ్‌కు విరామం, కుటుంబ వేడుకలో సందడి!
Parvinder Jhota: డ్రగ్స్ అమ్మడాన్ని ప్రశ్నించిన పర్వీందర్.. ఫేస్బుక్ లైవ్ స్ట్రీమింగ్‌లోనే కాల్చివేత
Chakali llamma | చాకలి ఐలమ్మ విగ్రహ ధ్వంసంపై పద్మా దేవేందర్‌రెడ్డి ఆగ్రహం
Harsha | నెట్‌ఫ్లిక్స్‌లో హర్ష వెబ్‌సిరీస్ జోరు.. ‘ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో’ను వెనక్కి నెట్టి టాప్‌లోకి!
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

