Best ZP Siricilla | సిరిసిల్ల జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ న్యాలకొండ అరుణ, వైస్ చైర్మన్ సిద్ధం వేణు, డీపీవో రవీందర్లకు రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అందజేశారు. ఆదివారం జాతీయ పంచాయితీ రాజ్ దినోత్సవం సందర్భంగా రంగారెడ్డి జిల్లా పరిషత్ భవనంలో అవార్డు ప్రధానోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పంచాయితీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చేతుల మీదుగా సిరిసిల్ల జిల్లా ప్రజా పరిషత్ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, వైస్ చైర్మన్ సిద్ధం వేణు, సీఈఓ గౌతమ్ రెడ్డి, వివిధ మండలాల జడ్పీటీసీలు, జడ్పీపీ కో-ఆప్షన్ సభ్యులు అందుకున్నారు.
ముస్తాబాద్ మండలం మద్దికుంట, తంగల్లపల్లి మండలం మండేపల్లి గ్రామ పంచాయతీలకు ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డులు లభించాయి. ఈ అవార్డులను ఆయా గ్రామాల సర్పంచ్లతో కలిసి జిల్లా పంచాయితీ అధికారి రవీందర్ స్వీకరించారు. తదుపరి హైదరాబాద్లో ఐటీ, పురపాలక పట్టణాభివృద్ధిశాఖ మంత్రి కేటీ రామారావును మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారిని మంత్రి కేటీఆర్ సన్మానించి అభినందించారు.