IAS Transfers | హైదరాబాద్ : ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌తో సిరిసిల్ల కలెక్టర్‌కు ఏర్పడిన వివాదం వేటు వరకు దారి తీసింది. తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా ఆరుగురు ఐఏఎస్ ఆఫీసర్లు బదిలీ కాగా, అందులో సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా కూడా ఉన్నారు. సందీప్ కుమార్ ఝాను టీఆర్ అండ్ బీ ప్రత్యేక కార్యదర్శిగా బదిలీ చేయగా, ఆయన స్థానంలో సిరిసిల్ల కలెక్టర్‌గా ఎం హరిత నియామకం అయ్యారు. వీరితో పాటు మొత్తం ఆరుగురు ఐఏఎస్‌లు బదిలీ కాగా, ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
వాణిజ్య పన్నుల కమిషనర్‌గా ఎం రఘునందన్ రావు బదిలీ అయ్యారు. రవాణా శాఖ కమిషనర్‌గా కూడా రఘునందన్ రావుకు అదనపు బాధ్యతలు అప్పగించారు. వ్యవసాయ శాఖ కమిషనర్‌గా కే సురేంద్ర మోహన్, జీఏడీ ముఖ్య కార్యదర్శిగా రిజ్వీకి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శిగా కే హరిత నియామకం అయ్యారు. టీఆర్ అండ్ బీ ప్రత్యేక కార్యదర్శిగా సందీప్ కుమార్ ఝా బదిలీ అయ్యారు. రాజన్న సిరిసిల్ల కలెక్టర్‌గా ఎం హరిత నియామకం అయ్యారు.