రాజన్న సిరిసిల్ల, డిసెంబర్ 27 (నమస్తే తెలంగాణ): సిరిసిల్ల సహకార విద్యుత్ సరఫరా సంఘం (సెస్) చైర్మన్‌గా చిక్కాల రామారావు, వైస్ చైర్మన్‌గా దేవరకొండ తిరుపతి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రెండు పదవులకు సింగిల్ నామినేషన్లు దాఖలు కావడంతో ఏకగ్రీవంగా గెలిచినట్టు ఎన్నికల అధికారి బీ మమత తెలిపారు. 15 స్థానాల్లో గెలిచిన బీఆర్ఎస్కు చెందిన డైరెక్టర్లందరూ మంగళవారం ఉదయం సిరిసిల్ల సెస్ కార్యాలయానికి చేరుకున్నారు.
కార్యాలయ సమావేశ మం దిరంలో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలను ఎన్నికల అధికారి నిర్వహించారు. సభ్యులందరికి నామినేషన్ల పత్రాలు అందించా రు. చైర్మన్ పదవికి తంగళ్లపల్లి మండలం నుంచి డైరెక్టర్‌గా గెలిచిన చిక్కాల రామారావు, వైస్ చైర్మన్ పదవికి కోనరావుపేట మండలం నుంచి డైరెక్టర్‌గా గెలుపొందిన దేవరకొండ తిరుపతి తమ నామినేషన్లను ఎన్నికల అధికారికి సమర్పించారు. మ ధ్యాహ్నం 3 గంటలకు ఎన్నికల ఫలితాలు వెల్లడించారు. రెండు స్థానాలకు ఒక్కొక్క నామినేషన్ మాత్రమే దాఖలు కావడంతో చైర్మన్‌గా చిక్కాల రామారావు, వైస్‌చైర్మన్‌గా దేవరకొండ తిరుపతి ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు మమత ప్రకటించారు.
మంత్రి కేటీఆర్ శుభాకాంక్షలు
సిరిసిల్ల సహకార విద్యుత్తు సరఫరా సంఘానికి ఎన్నికైన నూతన పాలకవర్గానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మం త్రి కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. చైర్మన్‌గా ఎన్నికైన చిక్కాల రామారావు, వైస్‌చైర్మన్‌గా ఎన్నికైన దేవరకొండ తిరుపతితో పాటు డైరెక్టర్లందరికీ స్వయంగా ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రైతాంగం, ప్రజలు అద్భుతమైన విజయాన్ని అందించి మరింత బాధ్యతను పెంచారని పేర్కొన్నారు.