హైదరాబాద్, మే 29 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో అర్హత కలిగిన ప్రతి ఒక్కరినీ ఓటరు జాబితాలో చేర్చాలని, అదే సమయంలో అనర్హుల పేర్లను జాబితా నుంచి పూర్తిగా తొలగించాలని రాష్ట్ర సీఈవో సీ సుదర్శన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. త్వరలో రాష్ట్రంలో చేపట్టనున్న ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సర్వే(సర్) ప్రక్రియను అత్యంత పకడ్బందీగా నిర్వహించాలని స్పష్టంచేశారు. హైదరాబాద్‌లోని రాష్ట్ర ఎన్నికల ప్రధాన కార్యాలయం నుంచి అదనపు చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ వాసం వెంకటేశ్వర్‌రెడ్డితో కలిసి ఆయన శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎన్నికల అధికారులకు దిశానిర్దేశం చేశారు.