సంగారెడ్డి : కొద్ది రోజులుగా రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు తోడు ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్ట్‌లు నిండు కుండలా మారాయి. చెరువులు, కుంటలు మత్తడి దుంకాయి. అయితే సింగూరు ప్రాజెక్ట్‌కు (Singuru Project) వరద తగ్గుముఖం(Flood recedes) పట్టడంతో ప్రాజెక్టు క్రస్ట్ గేట్లను(Crest Gates Closed) అధికారులు మూసివేశారు. ఇన్ ఫ్లో 8,242 క్యూసెక్కులు. ఔట్ ఫ్లో 3100 క్యూసెక్కులుగా ఉంది.
2,842 క్యూసెక్కులని దిగువకి విడుదల చేసి జలవిద్యుత్ని ఉత్పత్తి చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 29.917 టీఎంసీలు కాగా ప్రస్తుతం 28.530 టీఎంసీల నీరు నిల్వ ఉంది. కాగా, సింగూరు ప్రాజెక్టు వరద నీటితో నిండుకుండలా మారింది. ప్రాజెక్టు అధికారులు ఎప్పటికప్పుడు నీటి హెచ్చుతగ్గులను గమనిస్తూ ప్రాజెక్టు వద్దే ఉంటున్నారు. సందర్శకులను ప్రాజెక్టుపైకి అనుమతించడం లేదు.
ఇవి కూడా చదవండి..
KCR | బతుకంతా తెలంగాణ కోసమే అర్పించిన అక్షర తపస్వి కాళోజీ: కేసీఆర్
KTR | కాళోజీ కలం.. సామాన్యుల గళం.. ప్రజలకు బలం: కేటీఆర్
Nalimela Bhaskar | సాహితీవేత్త నలిమెల భాస్కర్‌కు కాళోజీ పురస్కారం