వనపర్తి, జనవరి 19 (నమస్తే తెలంగాణ) : సీఎం రేవంత్ నేరపూరిత వ్యాఖ్య లు చేశారని, హింసను ప్రేరేపిస్తూ ప్రజలను రెచ్చగొట్టడం అత్యంత దుర్మార్గమని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి దుయ్యబట్టారు. సీఎం మాటలపై డీజీపీ కేసు నమో దు చేయాలని డిమాండ్ చేశారు. సోమవారం ఆయన వనపర్తిలోని తన నివాసం లో మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ దిమ్మెలు కూల్చండంటూ సీఎం పిలుపునివ్వడం విద్వేషాలు రగిల్చడం తప్ప మరోటికాదని అన్నారు. పోలీస్ వ్యవస్థ చట్టబద్ధంగా నడుస్తుందనుకుంటే రేవంత్ మాట్లాడిన అంశాలను పరిగణనలోకి తీసుకు ని కేసు నమోదు చే యాలని సూచించారు. సీఎం పదవి కి కళంకం తెచ్చే వి ధంగా మాట్లాడుతుంటే బాధ్యతగల సంస్థ లు మౌనంగా ఉండటం సరికాదని అన్నా రు. ప్రత్యేక రాష్ట్ర సాధనకు టీడీపీ అడ్డుపడిందని, ఈ కారణంగానే ప్రజలు తెలంగాణ నుంచి ఆ పార్టీని ఖాళీ చేయించినట్టు చెప్పారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు గట్టు యాదవ్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
బాన్సువాడ/బాన్సువాడ రూరల్, జనవరి 19: బీఆర్ఎస్ గద్దెలను కూల్చాలన్న రేవంత్.. ఆయన గద్దె కూలేటట్టు ఉన్నదని ఆర్టీసీ మాజీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ అ న్నారు. సీఎం రేవంత్, మంత్రులు రాష్ర్టా న్ని దోచుకుంటున్నారని ఆరోపించారు. సోమవారం కామారెడ్డి జిల్లా బాన్సువాడ లో నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల స న్నాహక సమావేశంలో బాజిరెడ్డి మాట్లాడా రు. మోసపూరిత హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌కు రోజులు దగ్గర ప డ్డాయని అన్నారు. సీఎం తన మంత్రులపై పత్రికల్లో తప్పుడు కథనాలు రాయిస్తూ.. వారి ఇమేజ్ను డ్యామేజ్ చేస్తున్నారని ధ్వజమెత్తారు. సీఎం, మంత్రులు దోచుకో, దాచుకో అనే రీతిలో వ్యవహరిస్తున్నారని విమర్శించారు. పోరాడి తెచ్చుకున్న తెలంగాణకు రేవంత్ అన్యాయం చేసి ఏపీ సీఎం చంద్రబాబు సంకలో చేరడం ఖాయమని జోస్యం చెప్పారు. పోలీసులు లేకుండా బయటకు వస్తే సీఎంను ప్రజలు వెంబడించి కొడతారని హెచ్చరించారు. కాంగ్రె స్, సీపీఎంకు చెందిన పలువురు బీఆర్ఎస్లో చేరగా బాజిరెడ్డి వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.