కాంగ్రెస్ గారడీలపై కార్మికుల ఆగ్రహం
ఎన్నికల ముందు సింగరేణి కార్మికులకు కాంగ్రెస్ హామీలు - అధికారం కోసం అడ్డగోలు వాగ్దానాలు - గద్దెనెక్కిన తర్వాత మొండి‘చెయ్యి’.. సింగరేణి కార్మికుల సంక్షేమానికి పూర్తి భరోసా అంటూ మ్యానిఫెస్టో.. సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఐఎన్టీయూసీ నుంచి 39 హామీలు
కరీంనగర్, అక్టోబర్ 13 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/ గోదావరిఖని : ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆరు జిల్లాలు, 13 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో విస్తరించి ఉన్న సింగరేణి ప్రాంతంలో సీట్లు కైవసం చేసుకోవడానికి ఎన్నికల సమయంలో అడ్డగోలు హామీలిచ్చిన కాంగ్రెస్, అధికారంలోకి వచ్చాక ఏ ఒక్క హామీని కూడా అమలు చేయకుండా మొండిచెయ్యి చూపుతున్నది. అధికారం కోసం కార్మికుల సంక్షేమం, ఉద్యోగ భద్రత, వైద్య సదుపాయాలు, గృహ వసతి, వేతనాల వంటి అంశాలపై హామీలు గుప్పించి పీఠం దక్కగానే మరిచిపోయింది. ఆ తర్వాత సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల సమయంలో కాంగ్రెస్ అనుబంధ కార్మిక సంఘమైన ఐఎన్టీయూసీ 39 హామీలతో మ్యానిఫెస్టోను ప్రకటించింది. కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామని, వారి ఆర్థిక అభివృద్ధికి బాటలు వేస్తామని అంటూ హామీలు గుప్పించింది. కానీ, ఎన్నికలు ముగిశాక కార్మికుల ఆశలను ఆవిరి చేసింది. నేటికీ హామీల అమలుపై ఊసే లేకపోవడంతో కార్మిక వర్గాల్లో ఆగ్రహం వ్యక్తమవుతున్నది. ఇవి చాలవన్నట్టు కాంగ్రెస్ మరోసారి హామీలతో కార్మికులను మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తున్నది.
అసెంబ్లీ ఎన్నికల్లో అనేక గారడీలు
కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల మ్యానిఫెస్టోలోని 33వ పేజీలో సింగరేణి కార్మికుల సంక్షేమానికి సంబంధించి పలు హామీలు పొందుపరిచింది. కారుణ్య నియామకాల విధానాన్ని పునఃపరిశీలించి సరళీకృతం చేస్తామని ప్రకటించింది. కార్మికుల సంక్షేమం, అభివృద్ధి, భద్రతకు పటిష్టమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది. సింగరేణి పరిధిలో ఆధునిక విద్యాలయాలు ఏర్పాటు చేస్తామని, సంస్థ నిర్వహణలో రాజకీయ జోక్యాన్ని తగ్గిస్తామని పేర్కొన్నది. కార్మికుల వేతనాలను నిర్ణీత సమయంలో సవరించి చెల్లిస్తామని భరోసా ఇచ్చింది. లోతుగా చూస్తే కార్మికుల సంక్షేమం పక్కపోయి నాయకుల ప్రయోజనాలకు పెద్దపీట పడింది. ప్రధానంగా సింగరేణిలో రాజకీయ జోక్యం తగ్గిస్తామని చెప్పిన కాంగ్రెస్.. మితిమీరిన రాజకీయ జోక్యానికి పాల్పడుతున్నది.
39 హామీలతో ఐఎన్టీయూసీ మ్యానిఫెస్టో
సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల సమయంలో కార్మికుల ముందుకు ఐఎన్టీయూసీ 39 హామీలతో వచ్చింది. కార్మికుల ఉద్యోగ భద్రత నుంచి ఉద్యోగోన్నతులు, వైద్య సదుపాయాలు, క్వార్టర్ల ఆధునికీకరణ, మహిళా ఉద్యోగుల సమస్యల పరిష్కారం, ఆదాయపు పన్ను మినహాయింపు, స్థానికులకు ఉద్యోగాలు, అనుబంధ పరిశ్రమల ఏర్పాటు వరకు విస్తృతమైన హామీలు ప్రకటించింది. కాంగ్రెస్ ప్రభుత్వ సహకారంతో కార్మికుల సమస్యలను పూర్తిగా పరిష్కరిస్తామని గొప్పలు చెప్పింది. కానీ ఒడ్డుకు చేరగానే తెప్ప తగలేసినట్టుగా.. ఎన్నికలు అయిపోగానే ఇచ్చిన హామీలను గాలికి వదిలేయడంపై కార్మికులు రగలిపోతున్నారు.
మ్యానిఫెస్టో హామీల్లో కొన్ని..
- నూతన భూగర్భ గనులను ప్రారంభించి నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు
- డిపెండెంట్ ఉద్యోగులకు విద్యార్హతల ఆధారంగా నైపుణ్య శిక్షణ ఇచ్చి తగిన ఉద్యోగాల కల్పన
- స్థానికులకు 95 శాతం ఉద్యోగావకాశాలు కల్పించేలా కృషి
- భూగర్భ గనుల్లో వైద్యపరంగా అనర్హులైన మైనింగ్ స్టాఫ్, ఈఅండ్ఎం, ఈపీ ఆపరేటర్లకు ఉపరితల విభాగంలో ఉద్యోగాలు
- ఉద్యోగ విరమణ పొందిన కార్మికులకు అదే రోజు టెర్మినల్ బెనిఫిట్స్ అందేలా చర్యలు
- కార్మికులందరికీ సొంతింటి పథకం కింద 250 గజాల స్థలం, రూ.20 లక్షల వడ్డీలేని రుణం
- కార్మికుల క్వార్టర్లను డబుల్ బెడ్రూమ్ ఇండ్లుగా ఆధునికీకరణ.. అవసరమైన చోట కొత్త క్వార్టర్ల నిర్మాణం
- కార్మికులకు చెల్లించే అలవెన్సులపై ఐటీని యాజమాన్యమే చెల్లించేలా చర్యలు
- గతంలో వివిధ కారణాలతో ఇంక్రిమెంట్లు కోల్పోయిన కార్మికులకు తిరిగి ఇప్పించడం
- కార్మికులందరికీ ఇన్సెంటివ్ పథకం వర్తింపజేసేందుకు కృషి
- ఏరియా దవాఖానలను ఆధునికీకరించి, సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్ల ఏర్పాటు
- ప్రతి గని వద్ద మైన్స్ చట్టం ప్రకారం.. అంబులెన్స్ ఏర్పాటు
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

