హైదరాబాద్, సెప్టెంబర్ 17 (నమస్తే తెలంగాణ): వ్యాపార విస్తరణ దిశలో భాగంగా రానున్న రోజుల్లో రాజస్థాన్‌లో సోలార్ పవర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్నట్టు సింగరేణి సంస్థ సీఎండీ ఎన్ బలరాం పేర్కొన్నారు. సింగరేణి భవన్ లో నిర్వహించిన ప్రజాపాలనలో భాగంగా ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. రానున్న ఐదేండ్లల్లో రూ.60వేల కోట్ల టర్నోవర్‌ను సాధించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని వెల్లడించారు.
సింగరేణిలో మూసివేసిన ఉపరితల గనుల్లో పంప్డ్ స్టోరేజీ ప్లాంట్, ఎన్టీపీసీలో మరో 800 మెగావాట్ల థర్మల్ విద్యుత్తు, ఒడిశాలోని నైనీ బొగ్లు బ్లాక్ సమీపంలో 1600 మెగావాట్ల థర్మల్ ప్లాంట్, మరో 800 మోగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్, గ్రీన్ హైడ్రోజన్ప్లాంట్, బ్యాటరీ స్టోరేజీ సిస్టమ్ వంటి వినూత్న ప్రాజెక్ట్‌లతో సింగరేణి ఉజ్వల భవిష్యత్తుకు పునాదులు వేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో సంస్థ అధికారులు ఎస్డీఎం సుబానీ, డీ రవిప్రసాద్ పాల్గొన్నారు.
సింగరేణిలో ఉద్యోగ ఫలితాలు విడుదల
హైదరాబాద్, సెప్టెంబర్ 17(నమస్తే తెలంగాణ): సింగరేణి కాలరీస్‌లో 272 ఎక్స్టర్నల్ ఉద్యోగాలకు జూలై 20, 21వ తేదీల్లో నిర్వహించిన ఆన్లైన్ ప రీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. అభ్యర్థుల ప్రొవిజినల్ జాబితాను scclmines.comలో అందుబాటులో ఉంచినట్టు అధికారులు తెలిపారు.