గోదావరిఖని/మంచిర్యాల, సెప్టెంబర్ 11 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): సింగరేణి కార్మిక సంఘం ఎన్నికల నిర్వహణకు ఈ నెల 22న లేబర్ కమిషనర్ షెడ్యూల్ విడుదల చేస్తారని టీబీజీకేఎస్ ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి తె లిపారు. సోమవారం హైదరాబాద్లో సింగరేణి కార్మిక సంఘాలతో డిప్యూటీ చీఫ్ లేబర్ కమిషనర్, సింగరేణి ఎన్నిక ల రిటర్నింగ్ అధికారి డీ శ్రీనివాసులు సమావేశమయ్యారని చెప్పారు. మెజార్టీ సంఘాల విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న డిప్యూటీ లేబర్ కమిషనర్ ఈ నెల 22న షెడ్యూల్ విడుదల చేయాలని నిర్ణయించారని, అక్టోబర్ 28న ఎన్నికలు నిర్వహించే అవకాశముందని తెలిపారు.