హైదరాబాద్, ఆగస్టు 7 (నమస్తేతెలంగాణ): సింగరేణి సీపీఆర్వో ఎస్డీఎం సుభాని ప్రతిష్ఠాత్మక ‘డాక్టర్ సీవీ నర్సింహారెడ్డి-పబ్లిక్ రిలేషన్స్ సొసైటీ ఆఫ్ ఇండియా పీఆర్ మేనేజర్-2025’ జాతీయ పురస్కారానికి ఎంపికయ్యారు. బుధవారం రాత్రి హైదరాబాద్లోని ఫెడరేషన్ ఆఫ్ ఇండియా తెలంగాణ చాంబర్ ఆఫ్ కామర్స్ హాల్లో జరిగిన ఓ కార్యక్రమంలో సుభానికి అవార్డును అంబేద్కర్ వర్సిటీ వీసీ ఘంటా చక్రపాణి అందజేశారు.
సింగరేణిలోని 12 గనుల్లో ప్రజాసంబంధాలను పటిష్టంగా నిర్వహిస్తూ సంస్థ లక్ష్యాలకు అనుగుణంగా కార్మికులను ప్రోత్సహించడంలో సుభాని కీలక భూమిక పోషించారని చక్రపాణి కొనియాడారు. కాగా, జాతీయ పురస్కారానికి ఎంపికైన సుభానిని సింగరేణి సీఎండీ బలరాం అభినందించారు.