నకిరేకల్, ఏప్రిల్ 9 : హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఈ నెల 27న నిర్వహించనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభ వాల్పోస్టర్లను నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య బుధవారం ఆవిష్కరించారు. నల్లగొండ జిల్లా నకిరేకల్ మెయిన్ సెంటర్లో ఆయనే స్వయంగా ఆర్టీసీ బస్సులు, ఆటోలకు అంటించారు. ఈ సందర్భంగా చిరుమర్తి మాట్లాడుతూ అనేక పోరాటాలతో రాష్ట్రం సాధించి, అన్ని రంగాల్లో ముందు నిలిపిన కేసీఆర్ పాలన మళ్లీ రావాలని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. రజతోత్సవ సభకు నకిరేకల్ నియోజకవర్గ వ్యాప్తంగా స్వచ్ఛందంగా తరలివచ్చేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారని తెలిపారు.