రాజన్న సిరిసిల్ల, ఏప్రిల్ 11 (నమస్తే తెలంగాణ) : కార్మికక్షేత్రమైన సిరిసిల్ల చేనేత కళాకారుడు, చేనేత కళారత్న అవార్డు గ్రహీత నల్ల విజయ్ మరో అద్భుతాన్ని ఆవిషరించారు. హైదరాబాద్కు చెందిన వ్యాపారవేత్త చెన్నారావు కోరిక మేరకు, 2 గ్రాముల బంగారం, 2 గ్రాముల వెండి పూతతో ఆకర్షణీయమైన చీరను రూపొందించారు. 25 రోజులపాటు శ్రమించి, ఐదున్నర మీటర్ల పొడవు, 48 ఇంచుల వెడల్పుతో ఈ కళాఖండాన్ని తీర్చిదిద్దారు. ఈ చీరను హైదరాబాద్లో శనివారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవిషరించి, నల్ల విజయ్ను సన్మానించి అభినందించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట అగయ్య, టెక్స్టైల్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గూడూరి ప్రవీణ్, సెస్ డైరెక్టర్ దార్నం లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.