హైదరాబాద్, ఏప్రిల్ 8 (నమస్తే తెలంగాణ): మోదీ పర్యటన అధికార దుర్వినియోగానికి పరాకాష్టగా నిలిచింది. దీనిని అధికారిక కార్యక్రమంగా ప్రకటించి, రైల్వే శాఖ తరఫున ఏర్పాట్లు చేయించారు. కానీ, ఈ సభను బీజేపీ బహిరంగ సభగా మార్చేశారు. వాస్తవానికి ఈ కార్యక్రమానికి రైల్వే శాఖ పాస్‌లు మంజూరు చేసింది. మీడియా పాస్‌లను సైతం రైల్వే శాఖే చూసుకున్నది. కానీ, వీఐపీ పాస్‌లను మాత్రం బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్‌కుమార్ సంతకంతో ఇవ్వడం గమనార్హం.