కవాడిగూడ, జూన్ 23: ఓ వ్యక్తి నుంచి లంచం తీసుకుంటుండగా గాంధీనగర్ ఎస్సై నర్సింహులు ఏసీబీ అధికారులకు మంగళవారం రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయాడు. ఏసీబీ డీఎస్పీ మాజిద్ అలీఖాన్ తెలిపిన వివరాల ప్రకారం ఓ కేసు విషయంలో స్టేషన్ బెయిల్ ఇప్పించడంతోపాటు భవిష్యత్తులో ఎలాంటి వేధింపులు లేకుండా ఉండేందుకుగాను లక్ష రూపాయలు ఇవ్వాలని ఎస్సై ఒప్పందం కుదుర్చుకున్నారు. ఒప్పందం ప్రకారం బాధితుడు కవాడిగూడ ప్రాంతంలో రూ.50 వేలను ఎస్సై నర్సింహులకు ఇస్తుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నామని తెలిపారు. గాంధీనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో సంజీవ్‌సింగ్ ఠాకూర్, అతని సోదరుడి మధ్య వ్యాపార లావాదేవీల విషయంలో గొడవలు జరుగుతున్నాయి. ఈ నెల 11న సోదరుడి ఫిర్యాదు మేరకు గాంధీనగర్ పోలీసులు సంజీవ్‌సింగ్ ఠాకూర్‌పై కేసు నమోదుచేశారు.
ఈ కేసులో సంజీవ్‌సింగ్ ఠాకూర్‌కు అనుకూలంగా వ్యవహరించి భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసేందుకు గాను లక్ష రూపాయలు ఇవ్వాలని ఎస్ఐ ఒప్పందం చేసుకున్నాడు. ఎస్సై నర్సింహులుపై కేసు నమోదు చేసి ఏసీబీ కోర్డు ప్రిన్సిపల్ స్పెషల్ జడ్జి ముందు హాజరుపరచి, అనంతరం రిమాండ్‌కు తరలించామని తెలిపారు. ఈ కేసులో ఎవరి ప్రమేయం ఉందన్న కోణంలో దర్యాప్తు జరుపుతున్నామని తెలిపారు. ప్రజలకు సేవ చేయాల్సిన పబ్లిక్ సర్వెంట్లు ఎవరైనా సరే డబ్బులు డిమాండ్ చేస్తే తక్షణమే 1064కు సమాచారం అందించాలని డీఎస్పీ సూచించారు.