హైదరాబాద్, నవంబర్ 19 (నమస్తే తెలంగాణ): ఫోన్ల ట్యాపింగ్ కేసులో ముందస్తు బెయిల్ కోసం ‘ఐన్యూస్’ టీవీ చానల్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రవణ్‌కుమార్ హైకోర్టులో పిటిషన్ వేశారు. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులతో కలిసి రాష్ట్రంలోని పలువురు ప్రముఖుల ఫోన్లను ట్యాపింగ్ చేయించారని, ఫోన్ల ట్యాపింగ్ పరికరాలను తన కార్యాలయంలోనే ఏర్పాటు చేయించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్రవణ్‌కుమార్ ప్రస్తుతం పరారీలో ఉన్నారు. ఈ నేపథ్యంలో నాంపల్లి కోర్టు ఇప్పటికే ఆయనకు నాన్-బెయిలబుల్ వారెంట్‌ను జారీ చేసింది. దీంతో ముందస్తు బెయిల్ కోసం శ్రవణ్‌కుమార్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై హైకోర్టు మంగళవారం విచారణ జరిపింది.