మంగళవారం 04 ఆగస్టు 2020
Telangana - Jul 09, 2020 , 03:38:23

నేడు, రేపుభారీవర్షాలు

నేడు, రేపుభారీవర్షాలు

  • పలుచోట్ల ఓ మోస్తరుగాచురుకుగా నైరుతి

హైదరాబాద్‌ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయి. దీంతో పలుచోట్ల మోస్తరు నుంచి భారీవర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఆదిలాబాద్‌, హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ మల్కాజిగిరి, మెదక్‌, సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, సంగారెడ్డి, జనగాం, యాదాద్రి భువనగిరి, వికారాబాద్‌ తదితర జిల్లాల్లో పలుచోట్ల నేడు, రేపు భారీవర్షాలు కురిసే అవకాశమున్నట్టు వెల్లడించారు.  


logo