హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 17(నమస్తే తెలంగాణ): ఆరిటెక్చర్, ఇంటీరియర్ డిజైన్ రంగాల్లో దేశంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఐఐఐడీ ఆధ్వర్యంలో ‘ఇన్సైడర్ ఎక్స్-2026’ పేరిట భారీ ఎత్తున ద్వైవార్షిక ప్రదర్శనను నిర్వహించనున్నట్టు ఐఐఐడీ-హెచ్ఆర్సీ చైర్పర్సన్, ఆరిటెక్ట్ ఎన్ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. ఈ భారీ షోకేజ్‌ను ఈనెల 19 నుంచి 21వ తేదీ వరకు హైదరాబాద్‌లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో నిర్వహించనున్నట్టు మంగళవారం వెల్లడించారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటీరియర్ డిజైనర్స్- హైదరాబాద్ రీజినల్ చాప్టర్ (ఐఐఐడీ-హెచ్ఆర్సీ) నిర్వహించనున్న ఈ మూడు రోజుల ప్రదర్శనను సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించనున్నారని పేర్కొన్నారు.
ఈ మూడు రోజులు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ప్రదర్శన ఉంటుందని ప్రవీణ్‌కుమార్ చెప్పారు. ఆధునిక సమాజాన్ని, దేశ ఆర్థికవృద్ధిని తీర్చిదిద్దడంలో ‘డిజైన్’ అత్యంత ప్రభావవంతమైనదని తెలిపారు. ప్రజల జీవన విధానం, పనితీరు, నేర్చుకొనే పద్ధతులు, ఒకరికొకరు సమన్వయం చేసుకోవడం వంటి విషయాలపై డిజైనింగ్ కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. హైదరాబాద్ నగరం సృజనాత్మకత, వ్యవస్థాపకత, సాంకేతికత, డిజైన్లకు ఒక శక్తివంతమైన కేంద్రంగా ఎదిగిందని తెలిపారు. ఐఐఐడీ చేపట్టే ఈ ప్రదర్శన ఆలోచనలు, ప్రతిభ, ఆవిషరణలు, పరిశ్రమల కలయికగా నిలుస్తుందని ధీమా వ్యక్తంచేశారు. ఈ ప్రదర్శన భవిష్యత్తు డిజైన్ రంగాన్ని తీర్చిదిద్దడానికి దోహదపడుతుందని తెలిపారు. ఈ ప్రదర్శనలో ఐఐఐడీ ప్రెసిడెంట్, ఆరిటెక్ట్ జిగ్నేశ్ మోదీ గౌరవ అతిథిగా హాజరుకానున్నారని చెప్పారు.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా దేశ, విదేశాల నుంచి ఆరిటెక్ట్లు, ఇంటీరియర్ డిజైనర్లు, బిల్డర్లు, కన్సల్టెంట్లు, ట్రేడ్ పార్ట్నర్లు, విద్యార్థులతోపాటు 6,000 మందికి పైగా వ్యాపార సందర్శకులు విచ్చేయనున్నట్టు వెల్లడించారు. కార్యక్రమంలో ‘ఐఐఐడీ షోకేస్ ఇన్సైడర్ ఎక్స్-2026’ కన్వీనర్, ఐఐఐడీ హెచ్ఆర్సీ గౌరవ కార్యదర్శి ఆరిటెక్ట్ రాకేశ్ వాసు సీఎస్, కో-కన్వీనర్, ఐఐఐడీ హెచ్ఆర్సీ కోశాధికారి ఆరిటెక్ట్ నవీన్ చలసాని, ఐఐఐడీ హెచ్ఆర్సీ వైస్ చైర్మన్ (ట్రేడ్) రమేశ్ పటేల్, ఇమ్మీడియట్ పాస్ట్ చైర్పర్సన్ ఆరిటెక్ట్ పల్లవి అంచూరి, ఆరిటెక్ట్ అమితారాజ్ తమ అనుభవాలను వివరిస్తారని చెప్పారు.
40 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో జరుగనున్న ఈ ప్రదర్శనలో 150కి పైగా ఎగ్జిబిటర్లు, 300 పైగా ప్రముఖ బ్రాండ్లు పాల్గొననున్నాయని ఎన్ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా నివాస, వాణిజ్య ఇంటీరియర్స్ కోసం సరికొత్త ఉత్పత్తులు, మెటీరియల్స్, టెక్నాలజీని పరిచయం చేస్తామని చెప్పారు. రన్ వే తరహాలో ప్రత్యేకంగా రూపొందించిన డిజైన్ స్ట్రీట్ ఎగ్జిబిషన్ కారిడార్, పరిశ్రమలోని ప్రముఖ నిపుణులతో నిర్వహించే నాలెడ్జ్ సెషన్స్, ఇంటర్నేషనల్ కీనోట్స్, విద్యార్థుల కోసం వర్షాప్లు, పోటీలు, ఇంటరాక్టివ్ లెర్నింగ్‌తో కూడిన ప్రత్యేక వేదికైన స్థాపత్య ఉత్సవ్ ఈ ఈవెంట్లో ప్రధాన ఆకర్షణగా నిలువనున్నదని వెల్లడించారు. ఆరిటెక్చర్, ఇంటీరియర్స్, నిర్మాణ రంగానికి సంబంధించిన భవిష్యత్తును మార్చబోతున్న సరికొత్త ట్రెండ్స్, ఆవిషరణలను ఈ ఈవెంట్ సమగ్రంగా పరిచయం చేయనున్నదని చెప్పారు. తొలిరోజు సాయంత్రం 5 గంటలకు కార్పొరేట్ మీట్ నిర్వహిస్తామని తెలిపారు.
1996లో స్థాపించిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటీరియర్ డిజైనర్స్- హైదరాబాద్ రీజినల్ చాప్టర్ 450కి పైగా సభ్యులతో దేశంలోనే అత్యంత గౌరవప్రదమైన డిజైన్ కమ్యూనిటీల్లో ఒకటిగా గుర్తింపు పొందిందని ఎన్ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. 2014లో ప్రారంభమైన ఐఐఐడీ షోకేస్ ఇన్సైడర్ ఎక్స్ దేశంలో అత్యంత ముఖ్యమైన డిజైన్ వేదికల్లో ఒకటిగా పేరుగాంచిందని పేర్కొన్నారు. ప్రతి ఎడిషన్ డిజైన్ రంగంలో మారుతున్న కాలానికి అనుగుణంగా కొత్తదనాన్ని పరిచయం చేస్తున్నదని తెలిపారు. 2018లో పట్టణ ప్రాంతాల పునర్నిర్మాణం, 2022లో తెలంగాణ కళలు, హస్తకళలు, పర్యావరణహిత మెటీరియల్స్ ప్రదర్శన, 2024లో డిజైన్ ఇంటెలిజెన్స్ అనే ఇతివృత్తంపై నిర్వహించిన ప్రదర్శనలు ఆకట్టుకున్నాయని చెప్పారు. 2026లోనూ అదే ప్రయాణాన్ని కొనసాగిస్తూ.. ఆవిషరణలు, సృజనాత్మకత, సాంకేతికత, పరస్పర సహకారాన్ని ఒకే వేదికపైకి తీసుకొస్తున్నట్టు పేర్కొన్నారు. ఐఐఐడీ హెచ్ఆర్సీ తన డిజైన్ ఎక్సలెన్స్ అవార్డ్స్, వార్షిక పురసారాల ద్వారా సృజనాత్మకత, పర్యావరణ, విశేష విజయాలను గౌరవించడమే కాకుండా.. ఉత్సాహభరిత, సహకారంతో కూడిన భవిష్యత్తుపై దృష్టి సారించిన డిజైన్ వ్యవస్థను పెంపొందిస్తున్నదని ఎన్ ప్రవీణ్‌కుమార్ తెలిపారు.